వర్షాకాలంలో స్పెస్‌జెట్ బంపరాఫర్: రూ.888 నుంచి టిక్కెట్ రేట్లు
న్యూఢిల్లీ: స్పైస్ జెట్ మాన్సూన్ సేల్ పేరుతో ఈ వర్షాకాలంలో బంపరాఫర్ ప్రకటించింది. దేశీయ విమానాల్లో ప్రయాణించే వారికి టిక్కెట్ ప్రారంభ ధరను రూ.888గా నిర్ణయించింది. ఇంటర్నేషనల్ ప్రారంభ ధరనురూ.3,499గా పేర్కొంది. ఈ ఆఫర్ సేల్ జూలై 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, ట్రావెల్ పీరియడ్ సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఉందని పేర్కొంది.
టిక్కెట్ల విక్రయాలు మంగళవారం (2 జూలై) ప్రారంభమయ్యాయి. శనివారం (6వ తేదీ) ముగియనుంది. 2019 సెప్టెంబర్ 25 వరకు ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. నేరుగా వెళ్లే విమానాల్లో మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది.

ఈ ఆఫర్‌లో చెన్నై-బెంగళూరు, బాగ్‌దోగ్రా-గౌహతి వంటి దేశీయ మార్గాలతో పాటు మధురై-కొలంబో, చెన్నై-కొలంబో, కోచి-మాలే, గౌహతి-ఢాకా, ముంబై - రియాద్ - ముంబై, ముంబై - ఢాకా - ముంబై, ఢిల్లీ - ఢాకా - ముంబై, ఢిల్లీ - జెడ్డా - ఢిల్లీ తదితర ఇంటర్నేషనల్ రూట్లకు ఉన్నాయి. సాధారణ రద్దు ఛార్జీలతో టికెట్లు రద్దు చేసుకోవచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులతో స్పైస్ మ్యాక్స్ సీట్లపై 50 శాతం తక్షణ రాయితీ ఉంది.
డిస్కౌంట్ వన్ వేర్ ఫేర్‌కు మాత్రమే వర్తిస్తుంది. అలాగే, ఇతర ఆఫర్లకు సంబంధం లేదు. జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా నిలిపివేసిన అనంతరం దేశీయ పౌర విమానయాన మార్కెట్లో ఇతర సంస్థలకు డిమాండ్ పెరిగింది. ఇలాంటి సమయంలో స్పైస్ జెట్ నుంచి ఆఫర్ వచ్చింది. కాగా, ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో డొమెస్టిక్ ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 2.96 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications