ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ కంపెనీ స్టాక్ మార్కెట్లో నమోదు కానుందనే వార్తల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లకు అనధికార మార్కెట్లో భారీ డిమాండ్ కనిపిస్తోంది. రెవెన్యూలో మిగతా రిటైల్ కంపెనీల కంటే రిలయన్స్ రిటైల్ విలువ భారీగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనధికార మార్కెట్లో గత దీని మార్కెట్ కేపిటలైజేషన్ వ్యాల్యూ రూ.2.5 లక్షలుగా ఉందని భావిస్తున్నారు. లిస్ట్ అయిన మిగతా ఏడు పోటీ కంపెనీల కంటే దీని మార్కెట్ విలువ 75 శాతం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.

భారీగా రిలయన్స్ రిటైల్ షేర్ ధరలు
అన్‌లిస్టెడ్ మార్కెట్లో రిలయన్స్ రిటైల్ షేర్లు గత 2 వారాలుగా రూ.475 నుంచి రూ.500 మధ్య ట్రేడ్ అవుతున్నాయి. ఈ షేర్లు కంపెనీ ఉద్యోగులకు చెందినవిగా చెబుతున్నారు. షేర్లు పరిమితంగా ఉన్నాయని, దీంతో డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు. షేర్లను పరిమితంగా తీసుకు రావడంతో వీటి విలువ గ్రే మార్కెట్లో 30 - 40 శాతం పెరుగుతోందని చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్ షేర్లకు అన్‌లిస్టెడ్ మర్కెట్లో భారీ డిమాండ్ ఉందని, ప్రస్తుతం రూ.475 నుంచి రూ.500గా ఉందని, అడిగే రేటు రూ.700-800 మధ్య ఉందని అభిషేక్ సెక్యూరిటీస్ సీఈవో సందీప్ చెప్పారు.

ఎం-క్యాప్ విలువలు ఇలా..
అవెన్యూ సూపర్‌మార్కెట్స్, డీమార్ట్, ఫ్యూచర్ రిటైల్, ట్రెంట్, స్పెన్సెర్స్ అన్ని కలిసినప్పటికీ రిలయన్స్ రిటైల్ వ్యాల్యుయేషన్ ముందు తక్కువే అంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ కేపిటలైజేషన్ (M-CAP) రూ.8.04 లక్షల కోట్లు. అవెన్యూ సూపర్ మార్కెట్ M-CAP రూ.88,897 కోట్లు, ఫ్యూచర్ రిటైల్ రూ.24,130 కోట్లు, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ రూ.16,406 కోట్లు, ట్రెంట్ రూ.15,093 కోట్లు, ఫ్యూచర్ లైఫ్ స్టయిల్ రూ.9,141 కోట్లు, షాపర్స్ స్టాప్ రూ.4,307 కోట్లు, అరవింద్ ఫ్యాషన్స్ రూ.4,032 కోట్లు, వి-మార్ట్ రిటైల్స్ రూ.3,989 కోట్లుగా ఉంది.

ముఖేష్ అంబానీ సూపర్ ప్లాన్
రిలయన్స్ రిటైల్ షేర్లకు బాగా డిమాండ్ ఉండటంతో రిలయన్స్ గ్రూప్‌కు పేరుకుపోతున్న అప్పుల నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడనున్నాయని, అందుకే స్టాక్ మార్కెట్లో నమోదు చేయనున్నారని చెబుతున్నారు. 'రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అప్పులు పేరుకుపోతున్నాయని, దీన్నుంచి బయటపడేందుకు రిలయన్స్ రిటైల్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నారు' అని ముంబైకి చెందిన బ్రోకరింగ్ సంస్థ జమ్నాదాస్ విర్జి అడ్వైజరీ మేనేజింగ్ పార్ట్‌నర్ ధరన్ షా అన్నారు. మార్చి 31, 2019 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నెట్ డెబిట్స్ రూ.2.72 లక్షల కోట్లు.

రుణభారం తగ్గించుకునే యోచన
ఆయిల్ కంపెనీల నుంచి టెలికం వరకు.. తన అన్ని రుణాలు తగ్గించుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియదని చెబుతున్నారు. రూ.1 లక్ష కోట్ల యాన్యువల్ రెవెన్యూ దాటిన తొలి దేశీయ కంపెనీ రిలయన్స్ రిటైల్. ఈ కంపెనీ ఆదాయం 2018-19లో రూ.1,30,556 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది 69,198 కోట్లుగా ఉంది. అంటే అప్పటి కంటే 89 శాతం అధికం. అంతకుముందు ఏడాది లాభాలు రూ.2,529 కోట్లుగా ఉంటే, గత ఏడాది వడ్డీ, ట్యాక్స్ తీసివేయకుండా రూ.6,201 కోట్ల లాభాలు నమోదయ్యాయి. ఇది 145 శాతం పెరుగుదల. ఈ రంగంలో సెకండ్ బిగ్గెస్ట్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ సేల్స్ రూ.20,333 కోట్లుగా ఉంది.

రిలయన్స్ రిటైల్
తన పోటీ కంపెనీలతో పోలిస్తే రిలయన్స్ రిటైల్ గ్రే మార్కెట్ ధర బాగానే ఉంది. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వ్యాల్యూ చాలా ఖరీదైనదని చెబుతన్నారు. ఈ స్టాక్ వ్యాల్యూ రూ.380-390 మధ్య ఆసక్తిగా కనిపిస్తోందని అంటున్నారు. షేర్ రూ.500 వద్ద ఉన్న రిలయన్స్ రిటైల్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియే (PE) వ్యాల్యూ 2019 ఆర్థిక సంవత్సరం నికర లభాల కంటే 200 రెట్లు అధికమని చెబుతున్నారు. 2019 ఆర్థిక సంవత్సరపు PE విలువ అవెన్యూ సూపర్ మార్కెట్స్ 93 రెట్లు, ఫ్యూచర్ రిటైల్ 33 శాతంగా ఉంది. వాల్‌మార్ట్ 22 రెట్లు, టెస్కో 17 రెట్లు, కేర్‌ఫోర్ 21 రెట్లుగా ఉంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications