అమరావతి: ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలు 11వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నవరత్నాల అమలును ప్రతిబింబించేలా బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. నాలుగు నెలలకు అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపాయి. కాగా, ప్రతిపాదనలు పంపించాలని ఇప్పటికే ఆర్థిక శాఖ పంపించగా, ఆయా శాఖలు పంపించాయి.

12వేల కోట్లు అడిగిన వైద్య ఆరోగ్య శాఖ
వచ్చే బడ్జెట్లో రూ.రూ.12,713.90 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖను వైద్య ఆరోగ్య శాఖ కోరింది. గత ఏడాది కంటే రూ.50.22 శాతం అదనంగా నిధులు కోరింది. ఉద్యోగులు, వైద్యుల వేతనాల చెల్లింపుల కోసం రూ.11,539.70 కోట్లు, ఆసుపత్రుల భవన నిర్మాణాలు, ఆరోగ్యశ్రీ, ఇతర అవసరాల కోసం రూ.1,174.20 కోట్లు అవసరమని తెలిపింది. జలవనరుల శాఖ రూ.30వేల కోట్లకు ప్రతిపాదనలు పంపించింది. జలయజ్ఞం ప్రాజెక్టులకు రూ.8వేల కోట్లు అవసరమని ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.9వేల కోట్లు అడిగారు. పునరావాసం కోసం రూ.8వేల కోట్లు అడిగారని తెలుస్తోంది. బ్రాహ్మణ కార్పోరేషన్ రూ.150 కోట్లకు ప్రతిపాదనలు పంపించింది.

5వేల కోట్లు అడిగిన ఆర్థిక శాఖ
బడ్జెట్లో రూ.5,116.40 కోట్లు కేటాయించాలని రెవెన్యూ శాఖ కోరింది. రూ.3,686 కోట్లు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుకు అవసరమని తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు రూ.25 కోట్లు, అర్హులైన పేదలకు ఉచిత ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరమని పేర్కొంది. తొలి ఏడాది 3.50 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయింపు లక్ష్యమని తెలిపింది. రూ.10,619 కోట్లు కేటాయించాలని పౌరసరఫరాల శాఖ కోరింది. ఇందులో రూ.5,600 కోట్లు బియ్యం, ఇతర సరుకుల పంపిణీపై రాయితీ కోసం, మిగతా రూ.5వేల కోట్లు గత ప్రభుత్వం హయాంలో చెల్లించాల్సిన బకాయిలు అని పేర్కొంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కార్డుదారులకు బియ్యాన్ని 5, 10 కేజీల సంచుల్లో ప్యాక్ చేసి ఇంటికి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రత్యేకంగా 157 ప్యాకింగ్ యూనిట్లు, సంచుల తయారీ/సేకరణకు బడ్జెట్ అవసరమని తెలిపింది.

దాదాపు రూ.40వేల కోట్ల ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ
ఇంటర్ వరకు అమ్మఒడి, కేంద్రీయ వంటశాలలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కింద విద్యాశాఖ ఈ కొత్త పథకాల కోసం రూ.9,168 కోట్లకు ప్రతిపాదనలు పంపించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు అమ్మఒడి పథకానికి రూ.5,500 కోట్లు అవుతాయని అంచనా. మొత్తంగా అన్ని కలిపి రూ.39,897.42 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. టెక్ 19, ఐ-హబ్‌కు అదనంగా రూ.65 కోట్లు ప్రతిపాదించారు. టీచర్ల వేతనాలకు రూ.20,864 కోట్లు, ఉన్నత విద్యకు రూ.3,171 కోట్లు ప్రతిపాదించారు. కాలేజీ విద్యకు రూ.1,339 కోట్లు, విశ్వవిద్యాలయాలు, యూజీసీ - 2016 వేతన బకాయిలు, కడప సీపీ బ్రౌన్ స్మారక లైబ్రరీకి రూ.905 కోట్లు ప్రతిపాదించారు.

బడ్జెట్ అంచనా రూ.2.10 లక్షల కోట్లు
అన్ని శాఖలకు సంబంధించిన ప్రాధాన్యాలు, వారి డిమాండ్లపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో దాదాపు రూ.2.26 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ సమర్పించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్రభుత్వం సమర్పించనున్న బడ్జెట్ స్వరూపం కొంత మేర తగ్గే అవకాశముందని తెలుస్తోంది. రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.17 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే అన్ని ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలు రూ.2.50 లక్షల కోట్లు దాటవచ్చునని తెలుస్తోంది.

నవరత్నాలే.. కొత్త పథకాలు వద్దు
అన్ని శాఖలు నవరత్నాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి సూచించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు నవరత్నాల హామీతో జగన్ అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలు నవరత్నాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ ప్రభుత్వ శాఖలో నవరత్నాల అమలుకు సంబంధించి ఏ తేదీ నుంచి అమలు చేయాలి? ఈ ఆర్థిక సంవత్సరానికి ఇందుకు సంబంధించి ఖర్చు ఎంతవుతుందనే అంశాలపై చర్చించారు. అందుకు అనుగుణంగా కేటాయింపులు చూపేందుకు ప్రధానంగా కసరత్తు జరిగింది. నవరత్నాలు మినహా కొత్త పథకాలకు ఎలాంటి ఆస్కారం ఉండదని ఆర్థిక శాఖ ఇప్పటికే స్పష్టం చేసిందని సమాచారం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications