న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో ఏయే రంగాలకు ఊరట కల్పిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది పక్కన పెడితే, అన్ని రంగాలవారు కూడా తమకు ఏం కావాలో కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా హెల్త్ ఇండస్ట్రీ, అలాగే కార్మిక వర్గాలు కూడా బాగానే ఆశలు పెట్టుకున్నాయి.
ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాలని, ఇందుకోసం మరిన్ని నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య రంగం కోరుకుంటోంది. ప్రధాని మోడీ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ అద్భుతమని, అయితే దీనికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఆయుష్మాన్ భారత్‌కు నిధుల కేటాయింపు అంత సులభం కాదని, కానీ అది అవశ్యం అంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్య రంగానికి 1.2 శాతం కేటాయిస్తున్నారని, రానున్న రెండు మూడేళ్లలో ఈ రంగానికి నిధులను దాదాపు మూడు రెట్లు పెంచుతారని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. బలమైన ప్రాథమిక సంరక్షణ వ్యవస్థ అవసరమని చెబుతున్నారు. శిక్షణ పొందిన వైద్యుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. శిశు పోషణ, మహిళల ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించేందుకు బడ్జెట్లో కేటాయింపులు ఉండాలంటున్నారు.

ఆరోగ్య భారత్ లక్ష్యంగా మెడికల్, ఫార్మా ఇండస్ట్రీ పని చేస్తోందని, దీనిపై సరైన అవగాహన కల్పించాలని కోరుతున్నారు. రూ.2 లక్షల కోట్ల రెవెన్యూ కలిగిన హెల్త్ ఇండస్ట్రీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరమని అంటున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (EMS) ఇండస్ట్రీ 90 శాతం ప్రభుత్వ నియంత్రణలో ఉందని, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు అత్యవసరమని, దీంతో దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా సకాలంలో వైద్య సేవలు అందించవచ్చునని చెబుతున్నారు. తలసరి అంబులెన్సుల నిష్పత్తి ఒకటికి లక్షా నలభై వేలకు పైగా ఉందని, ఇది ఒకటికి అరవై వేల నిష్పత్తిగా ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. వైద్య సాంకేతిక నిపుణుల శిక్షణ కోసం నైపుణ్య కేంద్రాలు అవసరమని చెబుతున్నారు. రోడ్లపై అంబులెన్స్ సేవలు, రైళ్లకు అత్యవసర మెడికల్ యూనిట్లు పెరగాలంటున్నారు.
రానున్న 2025 నాటికి ఆరోగ్య వ్యయం జీడీపీలో 1.15 శాతం నుంచి 2.5 శాతానికి పెరగాలని కోరుకుంటున్నారు. ప్రతి 51వేల మందికి ఒక హెల్త్ కేర్ ఉందని, కాబట్టి వీటిని పెంచాలంటున్నారు. ఆయుష్మాన్ భారత్ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆసుపత్రులను కూడా పెంచాలని కోరుతున్నారు. హోమియోపతిలో భారత్ వరల్డ్ లీడర్‌గా ఉందని, ఇంటర్నేషనల్ మెడికల్ కమ్యూనిటీ ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications