బ్యాంకులు, బీమాల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్స్ రూ.32,000 కోట్లు, ఫేక్ జీఎస్టీ క్లెయిమ్ రూ.2,565 కోట్ల

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,565 కోట్ల విలువైన ఫేక్ ఇన్‌పుట్ ట్యాక్స్ (ITC) క్లెయిమ్స్ గుర్తించినట్లుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకు సంబంధించి జీఎస్టీ అధికారులు 535 కేసులు బుక్ చేశారని పేర్కొన్నారు. 40మందిని అరెస్టు చేశారన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1,620 కేసులు గుర్తించామని, ఈ విలువ మొత్తం రూ.11,251 కోట్లుగా ఉందని తెలిపారు. 154 మంది అరెస్టయ్యారని ఆమె లోకసభలో వెల్లడించారు.

జీఎస్టీ ఎగవేతలపై కఠిన చర్యలు

జీఎస్టీ ఎగవేతలపై కఠిన చర్యలు

జీఎస్టీ అమలు చేసిన తొలి ఏడాది (2017 జూలై నుంచి 2018 మార్చి) ఐదు కేసులకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐటీసీ విలువ రూ.12.67 కోట్లు అన్నారు. జీఎస్టీ ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి స్పందిస్తూ... 2018-19లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 6,801 బ్యాంక్ కేసుల్లో రూ.71,542.94 కోట్ల ఫ్రాడ్ జరిగిందన్నారు.

బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్స్ విలువ రూ.14,578 కోట్లు

బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్స్ విలువ రూ.14,578 కోట్లు

బ్యాంకింగ్ వ్యవస్థలో గత ఏడాది క్లెయిమ్ చేయని డిపాజిట్ల విలువ 26.8 శాతం పెరిగి, రూ.14,578 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వీటి విలువ రూ.11,494 కోట్లు, 2016లో రూ.8,928 కోట్లుగా ఉందని తెలిపారు. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోనే క్లెయిమ్ చేయని డిపాజిట్స్ వ్యాల్యూ రూ.రూ.2,156.33 కోట్లుగా ఉందన్నారు.

ఇన్సురెన్స్ రంగంలో రూ.రూ.16,887 కోట్లు

ఇన్సురెన్స్ రంగంలో రూ.రూ.16,887 కోట్లు

అదే సమయంలో ఇన్సురెన్స్ సెక్టార్‌లో క్లెయిమ్ చేయని మొత్తం 2018 సెప్టెంబర్ చివరి నాటికి రూ.16,887.66 కోట్లుగా ఉందని, నాన్ లైఫ్ ఇన్సురెన్స్ రూ.989.62 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ (LIC) అమౌంట్ రూ.12,892 కోట్లుగా ఉందన్నారు. బ్యాంక్స్, ఇంన్సురెన్స్ సెక్టార్‌లో మొత్తం దాదాపు రూ.32,000 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్స్ ఉన్నాయన్నారు. ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లో సెక్షన్ 26ఏ ప్రకారం డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (DEAF) స్కీం కింద ఇలా పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్లెయిమ్ చేయకుండా ఉన్న డిపాజిట్స్, వాటి వడ్డీలతో కలిపి DEAFకు బదిలీ చేస్తారన్నారు. క్లెయిమ్ చేయని డిపాజిట్స్‌పై కస్టమర్ డిమాండ్ చేస్తే వాటిని వడ్డీతో పాటు చెల్లించాలని, ఆ తర్వాత DEAF నుంచి రీఫండ్ కోరాలని చెప్పారు. ఈ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును ప్రారంభంలో ఏడాదికి 4 శాతంగా ఉండగా, 2018 జూలై నుంచి 3.5 శాతంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+