శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా ఫేస్‌బుక్‌కు చెందిన ఆఫీసులను ఖాళీ చేశారు. ఇద్దరు ఉద్యోగులు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే సారిన్ అనే విషవాయువు బారినపడినట్లుగా గుర్తించారు. దీంతో సిలికాన్ వ్యాలీలోని ఈ మూడు కార్యాలయాలను కంపెనీ వర్గాలు సోమవారం ఖాళీ చేయించాయి. కంపెనీకి వచ్చిన ఓ పార్సిల్‌లో విషవాయువులు గుర్తించారు.
అనుమానిత పార్సిల్‌ను తాకిన ఇద్దరు ఉద్యోగుల్లో విషవాయువు భారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన కంపెనీ నిబంధనల ప్రకారం ప్రమాద నివారణ చర్యలు తీసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ మార్షల్స్ సంఘటన స్థలానికి చేరుకొని కంపెనీకి వచ్చిన పార్సిల్ విభాగాన్ని తనిఖీ చేశారు. విచారణ జరుపుతున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) కూడా దృష్టి సారించింది.

వచ్చే పార్సిల్స్‌ను ఫేస్‌బుక్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తుందని, ఈ ప్రమాదం కారణంగా వారి ప్రోటోకాల్ ప్రకారం కార్యాలయాలు ఖాళీ చేశారని, విచారణలో తేలుతుందని చెబుతున్నారు. ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఆంటోనీ హారిసన్ మాట్లాడుతూ... నాలుగు కార్యాలయాలు ఖాళీ చేశామని, పోలీసు విచారణకు సహకరిస్తామని చెప్పారు.
అధికారులు ఇంకా వస్తువును గుర్తించలేదని, ఖాళీ చేసిన నాలుగు భవంతుల్లో మూడు భవనాలను తిరిగి ఉపయోగించనున్నట్లు హారిసన్ వెల్లడించారు. ప్రాణాంతక సారిన్ ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. సారిన్ విషవాయువు అత్యంత ప్రమాదకరం.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications