న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రీ-ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కేంద్రం పలు హామీలు అమలు చేశామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ హామీలలో ఇప్పటికే ఎన్నో అమలు చేశామన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.6,764 కోట్లు విడుదల చేసిందన్నారు. అలాగే, రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు ఇచ్చిందని చెప్పారు.

విభజన హామీల కింద రూ.13,244 కోట్లు విడుదల
రెవెన్యూ లోటు భర్తీ కింద మొదటి మూడేళ్లలో నే రూ.3,979.50 కోట్లు ఇచ్చామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం... కొత్త విధానం ప్రకారం ఏపీ ప్రభుత్వం నుంచి డీపీఆర్ కోసం వేచి చూస్తున్నామన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించామని, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు లాభదాయకంగా కనిపించడం లేదన్నారు. ఉక్కు పరిశ్రమ అంశంపై తెలంగాణలోని బయ్యారందీ అదే పరిస్థితి అన్నారు. అయినా తదుపరి అధ్యయనం కోసం టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేశామన్నారు. విభజన హామీల అమలు కింద రూ.13,244 కోట్లు విడుదల చేశామన్నారు.

ఏపీ, తెలంగాణకు ఈ హామీలు
13వ షెడ్యూల్లో ఏపీ, తెలంగాణలకు కలిపి 24 హామీలు ఇచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఎయిమ్స్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఏర్పాటు పూర్తయిందన్నారు. విశాఖపట్నం ఐఐఎం తొలిదశ నిర్మాణ కార్యక్రమాలు 2021 జూన్ వరకు పూర్తవుతుందని, ఐఐఎస్‌ఈఆర్ శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని 2021 డిసెంబర్ వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటుకు భవనాన్నికేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

ఇవి చేశాం..
కృష్ణా జిల్లాలోని కొండపావులూరులో జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదించిందన్నారు. ఈ సంస్థ సౌతిండియా క్యాంపస్ విజయవాడలో 2016 నుంచే కార్యకలాపాల్ని ప్రారంభించిందని చెప్పారు. కాకినాడ సమీపంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ భరించాలని, ఇదివరకే చెప్పామన్నారు. విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చామన్నారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులుగా ప్రకటించామన్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించామని గుర్తు చేశారు. అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే అలైన్‌మెంట్ ఖరారు పూర్తయిందని, ఎన్‌హెచ్‌ఏఐ దీని అమలు బాధ్యతలు చూస్తుందన్నారు. అమరావతి-గుంటూరు-విజయవాడ మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి 2017-18లోనే అనుమతిచ్చామన్నారు.

అమరావతి-హైదరాబాద్ రోడ్డు కనెక్టివిటీ
అమరావతి నుంచి హైదరాబాద్‌కు రోడ్, రైల్ కనెక్టివిటీ పనులు వేగవంతం చేశామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎర్రుపాలెం-నంబూరు వయా అమరావతి సింగిల్ న్యూలైన్ డీపీఆర్ ( డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌కు అప్రూవ్ చేశామని, టెంపరరీ క్యాంపస్ నుంచి 2018-19 ఏడాదిలో 50 మంది విద్యార్థులతో ఫస్ట్ బ్యాచ్ ప్రారంభమైందన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications