హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం దుమ్ము రేపుతోంది. గత రెండేళ్లుగా అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ అనారోక్ ప్రాపర్టీస్ తాజా నివేదిక ప్రకారం .. రెండేళ్ల లో సిటీ లో అమ్మకాలు ఏకంగా 76% వృద్ధి చెందాయి. 2017 తోలి త్రైమాశికం కేవలం 3,075 యూనిట్లు అమ్మకాలు నమోదు కాగా, 2019 తోలి త్రైమాశికం లో ఇవి ఏకంగా 5,400 కు పెరిగాయని అనారోక్ పేర్కొంది.

హైదరాబాద్‌లో ధరలు తక్కువ
మిగితా మహానాలతో పోల్చితే హైదరాబాద్ లో ఇప్పటికీ ధరలు చాల తక్కువ కావడం విశేషం. అయితే, అమ్మకాలు విషయంలో బెంగళూరు మహానగరం మన కన్నా ముందు ఉన్నప్పటికీ అక్కడి ధరలు చాల ఎక్కువ కావడం గమనార్హం. ఎప్పటి నుంచో అమ్మకుండా మిగిలి పోయిన ఇన్వెంటరీ కూడా ఈ మధ్య వేగంగా అమ్ముడు పోయిందని ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. బెంగళూరు లో రెండేళ్లలో దాదాపు 50,000 యూనిట్లు అదనంగా విక్రయించటం తో ఇన్వెంటరీ లెవెల్స్ ఏకంగా 44% తగ్గటం విశేషం. ఈ విషయం లో హైదరాబాద్ కూడా 6,000 యూనిట్లకు పైగా అదనపు విక్రయాలతో ఇన్వెంటరీ ని 21% తగ్గించుకొని దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.

బెంగళూరుతో పోటీ
ప్రాపర్టీ ధరల పెరుగుదల విషయం లోనూ మన హైదరాబాద్ .... బెంగళూరు తో పోటీ పడుతోంది. మన హైదరాబాద్ లో ఒక చదరపు అడుగు ధర 2017 లో సగటున రూ 3,950 ఉండగా ఇప్పుడు అది రూ 4,172 గా ఉన్నట్లు అనారోక్ ప్రాపర్టీస్ వెల్లడించింది. అంటే రెండేళ్ల ప్రాపర్టీ ధరలు 6% పెరిగాయి. అదే బెంగళూరు మహా నగరం లో 2017లో రూ 4,690 ఉండగా, 2019 లో రూ 4,950 గా ఉన్నాయట. అక్కడ కూడా పెరుగుదల 6% శాతంగా నమోదు ఐంది. చెన్నై, కోల్కతా నగరాల్లో ధరల పెరుగుల సున్నా శాతం కాగా, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 1 శాతం ధరలు తగ్గాయి. ముంబై లో మాత్రం 1 శాతం పెరిగాయి.

మౌలిక సదుపాయాలు మెరుగు
హైదరాబాద్ , బెంగళూరు వంటి సాఫ్ట్ వేర్ హబ్ సిటీల లో పెట్టుబడుల కోసం దేశీయ పెట్టుబడి దారుల తో పాటు , ఎన్నారైలు అధికంగా ఆసక్తి కనబరుస్తుండటం ఈ నగరాల్లో ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. అయితే, అన్ని మహా నగరాల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెట్టుబడులపై రాబందుల విషయం లో మన హైదరాబాద్ మహా నగరం కూడా ముందు వరుసలో నిలుస్తుండటం విశేషం. మిగితా నగరాలతో పొల్చితే హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు మెరుగని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌లో మెరుగ్గానే...
ఈ ఏడాది మొదటి త్రైమాషికంలో కొత్త ప్రాపెర్టీల సరఫరా కూడా హైదరాబాద్ లో మెరుగ్గానే ఉంది. ఈ విషయం లోనూ మన నగరం 22% వృద్ధి తో 4,850 యూనిట్ల అదనపు సరఫరాను కలిగి ఉంది. సుస్థిరమైన పాలనా ఉండటం వాళ్ళ, పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ తో సత్సంభాలు నెలకొని ఉండటం వాళ్ళ వచ్చే 5 ఏళ్ళ లో కూడా హైదరాబాద్ లో అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications