సెకండ్ లార్జెస్ట్ ప్రయివేటు బ్యాంక్ ఐసీఐసీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. జూన్ 6వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 0.25 శాతం తగ్గించింది. ఈ క్యాలెండర్ ఇయర్లో ఆర్బీఐ వరుసగా మూడుసార్లు వడ్డీ రేటును 25 బేసిక్ పాయింట్ల చొప్పున తగ్గించింది. దీంతో వడ్డీరేటు 6.50 నుంచి 5.75కు తగ్గింది.
దీంతో ఈ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలని కొన్ని బ్యాంకులు నిర్ణయించాయి. ఐసీఐసీఐ కూడా వడ్డీ రేటును 0.10 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రుణాలు మరింత చౌక కానున్నాయి. డిపాజిట్ రేట్లపై వడ్డీని తగ్గించిన కొన్ని వారాలకే ఈ నిర్ణయం తీసుకొంది. ఆర్బీఐ తీసుకొన్న నిర్ణయాల లబ్ధి వినియోగదారులకు చేర్చేందుకు రుణ రేట్లను తగ్గించింది.

కొత్త రుణరేట్ల ప్రకారం గృహ మార్టగేజ్, ఆటో రుణాలపై వడ్డీరేట్లు 8.65 శాతంగా ఉన్నాయి. గత నెలలో ఐడీబీఐ వడ్డీ రేటును 5-10 బేసిక్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 5 బేసిక్ పాయింట్లు తగ్గించింది.
ప్రయివేటు సెక్టార్‌లోని టాప్ బ్యాంకులు యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు డిపాజిట్ పైన వడ్డీ రేటును జూన్ నెలలోనే 0.10 శాతం నుంచి 0.25కి తగ్గించింది.
యాక్సిస్ బ్యాంక్ సవరించిన వడ్డీ రేట్లు జూన్ 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. దేశీయ డిపాజిట్ల పైన రూ.2 కోట్ల వరకు ఒక సంవత్సరం మెచ్యూరిటీపై డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. ఉదాహరణకు బ్యాంకు 1 టెన్యూర్ పైన బ్యాంక్ 7.10 శాతం ఇచ్చింది. సవరణల తర్వాత 7.3 శాతం ఇవ్వనుంది.
కొటక్ మహీంద్రా బ్యాంక్ టెన్యూర్ కాలాన్ని 20 నెలల నుంచి 18 నెలలకు తగ్గించింది. 18 నెలల నుంచి 2 సంవత్సరాలలోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 7.10 శాతంగా నిర్ణయించింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల మెచ్యూరిటీ డిపాజిట్స్ పైన 10 బేసిక్ పాయింట్స్ తగ్గించి 7 శాతం చెల్లిస్తోంది.


Click it and Unblock the Notifications