చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లకు శుభవార్త. వీరికి మరింతగా పన్ను ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టిన వారికి పన్ను ప్రయోజనాలు కల్పించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆ రెండు ఫండ్స్.. సీపీఎస్ఈ, భారత్ -22 ఈటీఎఫ్. ప్రస్తుతం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ ఎస్ ఎస్) కల్పిస్తున్న ప్రయోజనాన్ని ఈ రెండు ఈటీఎఫ్ లలో పెట్టుబడికి కూడా వర్తింపజేసే అంశంపై అభిప్రాయం తెలియజేయాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కు పెట్టుబడులు, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ శాఖ (దీపం) లేఖ రాసింది. ఒక వేళ సీబీడీటీ ఓకే చెబితే 2019-20 బడ్జెట్ లోనే ప్రకటన వచ్చే విధంగా తుది ప్రణాళికపై పని చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈఎల్ఎస్ఎస్ ప్రయోజనాలను ఈటీఎఫ్ లకు అందజేసినా ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ ఈటీఎఫ్ లలో రిటైల్ పెట్టుబడులు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అంతే కాకుండా గృహ పొదుపు మొత్తాలు పెట్టుబడుల దిశగా సాగడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

* ప్రస్తుతం ఈఎల్ ఎస్ ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులపై సెక్షన్ 80 సి కింద గరిష్టంగా రూ. 1.50 లక్షల పన్ను మినహాయింపు లభిస్తోంది. అయితే వీటికి మూడేళ్ళ లాకిన్ పీరియడ్ ఉంటుంది.
* ప్రభుత్వం ప్రస్తుతం సీపీఎస్ఈ ఈటీఎఫ్, భారత్-22 ఈటీఎఫ్ లను నిర్వహిస్తోంది. ఇవి స్టాక్ ఎక్స్చేంజిల్లో నమోదయ్యాయి.
* ఈ ఈటీఎఫ్ లు కూడా మ్యూచువల్ ఫండ్ స్కీం లాంటివే. ఇవి ప్రభుత్వ రంగ కంపెనీలకు సంబంధించినవి.
* ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు, బీమా కంపెనీలు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ తో కూడిన ఈటీఎఫ్ ను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
* ఇప్పటివరకు తెచ్చిన రెండు ఈటీఎఫ్ లకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్ధిక రంగ ఈటీఎఫ్ పై దృష్టిసారిస్తోంది.
*భారత్-22 ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.32,900 కోట్లు సమీకరించింది. అలాంటి సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా ఐదు విడతల్లో రూ. 38,000 కోట్లు సమీకరించింది.
* దీన్ని బట్టి ఈ ఈటీఎఫ్ లపై రిటైల్ ఇన్వెస్టర్లకు ఎంతగా ఆసక్తి ఉన్నదో తెలుసుకోవచ్చు. వీటికి పన్ను ప్రయోజనాలు కూడా కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తారని అంచనా వేస్తున్నారు.
* పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 85,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర లక్ష్యం రూ. 90,000 కోట్లుగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications