న్యూఢిల్లీ/కోల్‌కతా: ఎయిర్‌టెల్ 3G సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలుత పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో షట్ డౌన్‌ను ప్రారంభించింది. కోల్‌కతా సర్కిల్ పరిధిలో 3G సేవలు నిలిపి వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. 4G సేవలను బలోపేతం చేసేందుకు ఈ సర్కిల్‌లో స్పెక్ట్రమ్ మార్పులు చేపట్టినట్లు తెలిపింది. వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో దేశవ్యాప్తంగా 3జీ సేవలు ఆపివేస్తామని పేర్కొంది.
2016 సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో అరంగేట్రం అనంతరం దేశంలో 4G సేవలు విస్తృతమయ్యాయి. భారత్‌లో ఒక సర్కిల్‌లో 3G సేవలు నిలిపివేయడం ఇదే మొదటిసారి. అయితే 2G సేవలను మాత్రం కొనసాగిస్తుంది.
4G సేవలు మరింత విస్తృతం చేసే ఉద్దేశ్యంలో భాగంగా 3G సేవలు తగ్గిస్తున్నామని, 4G వైపు మళ్లుతున్నామని ఎయిర్‌టెల్ తెలిపింది. కోల్‌కతా నగరంలో ఎయిర్‌టెల్ మొబైల్ బ్రాడ్‌బాండ్ హైస్పీడ్ 4G సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 3G కస్టమర్లు అందరు కూడా వారి హ్యాండ్‌సెట్స్, సిమ్ కార్డులు అప్ గ్రేడ్ చేసుకోవాలని ఎయిర్‌టెల్ కోరింది.

కాగా, జనవరి - మార్చి క్వార్టర్‌లో సంస్థ ఆర్పు (ARPU-యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) 6.5 శాతం పెరిగి రూ.123కు పెరిగిందని భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల ప్రకటించింది. అయినప్పటికీ ఇది సరిపోదని పేర్కొంది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ ఆర్పు 116గా ఉంది. ఏడాది చివరలో ఆర్పు పెరగడం సంతోషకరమని, అయితే రూ.123తో స్థిరంగా ఉన్నట్లు కాదని భారతీ ఎయిర్‌టెల్ ఇండియా-సౌత్ ఏసియా ఎండీ అండ్ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు.
అంతకుముందు వచ్చిన ఏడాది కంటే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ బిజినెస్ రెండింతల కంటే ఎక్కువగా ఉంది. 2019 జనవరి-మార్చి పీరియడ్‌లో రూ.1,377.8 కోట్లుగా కాగా, అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో ఇది రూ.482.2 కోట్లుగా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications