వడోదర: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు (PNB స్కాం) నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు రూ.13,700 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ PNB స్కాం కంటే అతి పెద్ద కుంభకోణం మరొకటి వెలుగు చూసిందా? అంటే అవుననే అంటున్నారు. పీఎన్‌బీ కంటే పెద్ద స్కాం చోటు చేసుకుందని ఎన్‌ఫోర్సమెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటిక్ లిమిటెడ్(SBL) ప్రమోటర్లు అయిన సందేశరా సోదరులు పలు బ్యాంకులకురూ.14 వేల కోట్ల కుచ్చుటోపీ పెట్టారట.
SBL మరియు సందేశరా గ్రూప్ ప్రమోటర్లు నితిన్ సందేశర, చేతన్ సందేశర, దీప్తి సందేశరలు పెద్ద మొత్తంలో బ్యాంకు మోసాలకు పాల్పడ్డారు. రూ. 5,393 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017లో వీరిపై ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. భారత్‌లోని బ్యాంకుల నుంచే కాకుండా విదేశాల్లోని భారతీయ బ్యాంకుల బ్రాంచీల నుంచి కూడా వీరు దాదాపు రూ.9000 కోట్ల రుణాలు తీసుకున్నారట.

భారతీయ బ్యాంకుల నుంచి దేశీయ, విదేశీ కరెన్సీల్లో రుణాలు తీసుకున్నారు. ఆంధ్రా బ్యాంక్, యూకో బ్యాంక్, ఎస్బీఐ, అలహాబాద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణాలు పొందినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
తప్పుడు పత్రాలతో ఈ రుణాలు పొంది వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని తేలింది. ఈ కేసులో స్టెర్లింగ్ బయోటిక్‌కు చెందిన రూ.9,778 కోట్ల విలువైన ఆస్తులు ఈడీ జఫ్తు చేసింది. జఫ్తు చేసిన వాటిలో నైజీరియా ఆయిల్ రిగ్స్, షిప్స్, బిజినెస్ జెట్, లండన్ ప్లష్ ఫ్లాట్ ఉన్నాయి. ఇదే కేసులో అంతకుమందు రూ.4,730 కోట్లు అటాచ్ చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications