రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తాజాగా ఆమె వద్ద ఉన్న ఓ హ్యాండ్ బ్యాగ్ వార్తల్లోకి ఎక్కింది. దానికి కారణం.. ఆ బ్యాగ్ విలువ కోట్లాది రూపాయలు కావడమేనని తెలుస్తోంది. ఆ బ్యాగ్‌లో 200కు పైగా డైమండ్స్ పొందుపరిచారట.
దీనిని క్రొకడైల్ హ్యాండ్ బ్యాగ్‌గా చెబుతున్నారు. దీని విలువ అక్షరాలా రూ.2.6 కోట్లు అని చెబుతున్నారు. ఈ బ్యాగ్‌లో 240 డైమండ్స్ పొందుపరిచారట. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తాను, నీతా అంబానీ, మరో ఇద్దరితో కూడిన ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఇందులో తెలుపు రంగులోని హెర్మెస్ హిమాలయా బిర్కిన్ బ్యాగ్‌తో నీతా కనిపించారు. క్రిస్టీస్ డాట్ కామ్ ప్రకారం ఈ బ్యాగ్ ఖరీదైనది.

ఇది హెర్మెస్ హిమాలయ బిర్కిన్ బ్యాగ్... హ్యాండ్‌బ్యాగ్‌లలో ప్రత్యేకమైనది అంటున్నారు. 18 కేరట్ గోల్డ్ బ్యాగ్ పైన 240 వజ్రాలు పొదిగి ఉన్నాయి. 2017లో హిమాలయ క్రొకడైల్ డైమండ్ స్టైల్ బ్యాగ్ ఆక్షన్‌లో 379,261 డాలర్లు పలికిందట. అంటే మన రూపాయల్లో రూ.2.60 కోట్లకు పైగా ఉంటుంది. ఈ బ్యాగ్ మొత్తాన్ని మొసలి చర్మంతో తయారు చేశారు. ప్రముఖ గాయని, నటి జనే బిర్కిన్ ఈ ఖరీదైన బ్యాగులు ఉపయోగించేది. దీంతో ఆమె పేరు పైనే చలామణి అవుతున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications