అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకానికి ఏడాదికి రూ.5,085 కోట్లు అవసరమవుతాయని అంచనా. దీంతో 64.05 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. రైతులు, కౌలు రైతు కుటుంబాలకు రూ.12,500 కోట్ల చొప్పున అందించనున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6,000 రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తోంది. ఆ సాయానికి ఏపీ ప్రభుత్వం కొంత మొత్తం కలిపి రైతుకు రూ.12,500 ఇస్తుంది. కౌలు రైతులకు మాత్రం ఏపీ ప్రభుత్వం భరించేలా ప్రతిపాదనలు రూపొందించారు. దీనిని ముఖ్యమంత్రి జగన్ ఆమోదించాల్సి ఉంది.

అక్టోబర్ 15వ తేదీ నుంచి రైతు భరోసా
అక్టోబర్ 15వ తేదీ నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా రైతు భరోసాను లబ్ధిదారులకు అందజేయనున్నారు. రైతు భరోసా పరిధిలోకి 64.05 లక్షల మంది వస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 15.36 లక్షలమంది కౌలు రైతులు ఉంటారని అంచనా. ప్రతి రైతు కుటుంబానికి పీఎం కిసాన్ యోజన కింద రూ.6వేలు ఇస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రూ.6,500 ఇవ్వనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిసి మొత్తం రూ.12,500 ఇస్తారు. కేంద్రం తొలుత చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింప చేయాలని భావించింది. ఆ ప్రతి రైతుకు వర్తింప చేస్తున్నారు. అంటే రైతులందరికీ రాష్ట్ర సాయం రూ.6,500, కేంద్రం సాయం రూ.6,000 అవుతుంది.

ఎక్కువ మందికి ప్రయోజనం
ఏపీలో భూమి ఉన్న రైతులు 48.69 లక్షలు, కౌలు రైతులు 15.36 లక్షలు ఉన్నారని అంచనా. కేంద్రం మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రూ.6వేలు ఇస్తుంది. ఏపీ ప్రభుత్వం రూ.6,500 ఇవ్వనుంది. భూమి ఉన్న రైతులకు రైతు భరోసా కింద రూ.3,164.85 కోట్లు, కౌలు రైతులకు రూ.1,920 కోట్లుగా తేల్చారు. మొత్తం రూ.5,085 కోట్లు. ఏపీలో 1.25శాతం కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు 50 శాతం మంది ఉండగా, 2.5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు కూడా ఎక్కువ శాతమే ఉన్నారు. మొత్తంగా 50 శాతం మంది రైతులకు కావాల్సిన పూర్తి పెట్టుబడి ఈ పథకం కింద అందనుంది. కౌలు రైతులకు అర్హత రుణపత్రాలు జారీ చేయనున్నారు.

బీమా, వడ్డీ లేని రుణాలు
పంటల బీమా పథకం కింద ఈ ఏడాది 55 లక్షల హెక్టార్ల నోటిఫైడ్ పంటలకు రైతుల తరఫున రూ.2,163.30 కోట్లను ప్రభుత్వం బీమాగా చెల్లించనుంది. ఈ ఏడాది ప్రతి రైతుకూ వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు రూ.3,534.50 కోట్లను ప్రతిపాదించారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదవశాత్తు మరణించినా ఆ కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇస్తారు.

ప్రతిపాదనలు ఇలాగే ఉంటే...
ఆదాయ పన్ను చెల్లించేవారు, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, రూ.10వేలకు పైబడి పింఛను తీసుకునేవారు ప్రధానమంత్రి కిసాన్ యోజన పరిధిలోకి రారు. భర్త, భార్య, ఇద్దరు మైనర్ పిల్లలను పరిగణలోకి తీసుకుంటారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనినే ప్రాతిపదికగా తీసుకొని అన్నదాత సుఖీభవను తీసుకువచ్చింది. ఇప్పుడు అధికారులు కూడా ఇవే నిబంధనలతో అంచనాలు రూపొందించారని తెలుస్తోంది. ఈ లెక్కననే రూ.5,085 కోట్లు అవుతాయని అంచనా వేశారు. అయితే, ఇవే నిబంధనలతో రైతు భరోసాను అమలు చేస్తారా లేక ఎలాంటి నిబంధనలు లేకుండా భూమి ఉన్న వారందరికీ ఇస్తారా లేదా నిబంధనలు మారుస్తారా అనేది తెలియాల్సి ఉంది.

రైతు మిషన్
మరోవైపు, ఏపీలో రైతు మిషన్ ఏర్పాటు చేయనున్నారు. సీఎం చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి ఉంటారు. ఇందులో వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక, జలవనరులు, విద్యుత్ తదితర శాఖల మంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. సభ్య కార్యదర్శిగా కార్యనిర్వాహక హోదాతో ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తారని తెలుస్తోంది. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు, పశు సంవర్ధక శాఖ అధికారులకు ప్రాతినిథ్యం ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications