న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు జూన్ నెలపై శుభవార్త. అంతర్గతంగా సమకూర్చుకున్న రూ.2,000 కోట్ల ద్వారా ఈ వేతనాల చెల్లింపులను క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ నెల వేతనాల చెల్లింపుల కోసం నిధులు వచ్చాయని, సోమవారం నాడు ఉద్యోగుల ఖాతాల్లో శాలరీ జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
దాదాపు రూ.14,000 కోట్ల బకాయిలకు సంబంధించి టెలికాం విభాగం నుంచి అనుమతులు రావాల్సి ఉందని తెలుస్తోంది. రూ.750 కోట్ల వేతనాల కోసం విడుదల చేసిన బీఎస్ఎన్ఎల్, రుణాలకు సంబంధించి రూ.800 కోట్ల వడ్డీని చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, వెండర్స్ డ్యూస్ వంటి వాటికి చెల్లించింది.
వేతనాల కోసం ఫండ్స్ వచ్చాయని, వాటిని సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఫైనాన్స్ వింగ్ అధికారులు తెలిపారని ఆల్ ఇండియా యూనియన్ అండ్ అసోసియేషన్ ఆఫ్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (AUAB) కన్వీనర్ అభిమన్యు చెప్పారు. బీఎస్ఎన్ఎల్‌కు రూ.15 వేల కోట్ల వరకు డెబిట్స్ ఉన్నాయి.

మార్చి 31, 2019 వరకు ఉన్న డేటా ప్రకారం బీఎస్ఎన్‌ఎల్‌లో 1,63,902 ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 46,597 ఎగ్జిక్యూటివ్స్, 1,17,305 నాన్ ఎగ్జిక్యూటివ్స్. బీఎస్ఎన్ఎల్‌లో ఉద్యోగుల కాస్ట్ 75.06గా ఉండటం గమనార్హం. ప్రయివేటు టెలికం కంపెనీల్లో ఉద్యోగుల వేతనాలు, బెనిఫిట్స్ కాస్ట్ 2% నుంచి 5% మాత్రమే ఉంది.
ఇదిలా ఉండగా,ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఆర్థిక ఇబ్బందుల కారణంగా బకాయిలు చెల్లించలేక దేశవ్యాప్తంగా 1,000 టవర్లను మూసివేసింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ సర్కిళ్లలోని టవర్లను ఆపేసినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా విద్యుత్ చార్జీలు, ఐటీ సేవల బిల్లులు, టెలికాం మౌలిక వసతి సంస్థల బిల్లుల బకాయిలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రూ.1.5కోట్ల బకాయిలు చెల్లించనందున తమిళనాడులోని కోటగిరిలో బీఎస్ఎన్ఎల్ టవర్‌ను ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఇటీవల స్వాధీనపరుచుకుంది. బీఎస్ఎన్ఎల్‌కు దేశవ్యాప్తంగా 1.1 లక్ష టవర్లు ఉన్నాయి. వెయ్యి క్లోజ్ చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications