బెంగళూరు కేంద్రంగా సాఫ్ట్ వేర్ సేవలు అందించే మైండ్ ట్రీ కంపెనీని.... విభిన్న రంగాల్లో సేవలు అందించే లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ ) కొనుగోలు చేసింది. మైండ్ ట్రీ లో 60 % వాటా కొనుగోలు చేయడం తో ఇకపై ఈ కంపెనీ ఎల్ అండ్ టీ సొంతం అయినట్లే. భారత దేశ సాఫ్ట్ వేర్ రంగం లోనే మొట్ట మొదటి బలవంతపు టేకోవర్ గా ఈ లావాదేవీ నిలుస్తోంది. ఫౌండర్స్ అంగీకరించక పోయిన కూడా మైండ్ ట్రీ కంపెనీని తనకు నచ్చినట్లుగా కొనుగోలు చేయడంలో ఎల్ అండ్ టీ సఫలమైంది.
ఓపెన్ ఆఫర్ ద్వారా పబ్లిక్ షేర్ హోల్డర్స్ నుంచి దాదాపు 5. 09 కోట్ల ఈక్విటీ షేర్స్ ను కొనుగోలు చేసి ఈ నెల 26వ తేదీన ఎల్ అండ్ టీ ఈ లావాదేవిని పూర్తి చేసింది. ఇందుకోసం ఏకంగా రూ 4,989 కోట్లను వెచ్చించింది. మైండ్ ట్రీ ని ఎలాగైనా దక్కించు కోవాలన్న పట్టుదలతో ఏడాది క్రితమే ఎల్ అండ్ టీ .... మైండ్ ట్రీ లో వీజీ సిద్ధార్థ కు ఉన్న 20% కి పైగా వాటా ను కొనుగోలు చేసింది. అక్కడి నుంచి మైండ్ ట్రీ ప్రమోటర్లు కు పొగ పెట్టడం ప్రారంభించిన ఎల్ అండ్ టీ ఎట్టకేలకు తన పంతాన్ని నిలబెట్టుకోంది. ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్ నేతృత్వంలోనే మొత్తం ప్రక్రియ పూర్తయ్యింది.

మైండ్ఒ ట్రీ కంపెనీ లో ఒక్కో షేర్ కు రూ 980 చొప్పున కొనుగోలు చేసిన ఎల్ అండ్ టీ .. ఇప్పటి వరకు దాదాపు రూ 10,000 కోట్లను వెచ్చించింది.
గతంలో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ దిగ్గజం సత్యం కంప్యూటర్స్ సంక్షోభంలో ఉన్నప్పుడు దానిని కూడా కొనుగోలు చేయాలనీ ఎల్ అండ్ టీ ప్రయత్నించింది. కానీ బిడ్డింగ్ లో చాల తక్కువ మొత్తం కోట్ చేయడం తో పోటీ లో విఫలమైంది. మెరుగైన రేట్ కోట్ చేసిన మహీంద్రా గ్రూప్ కంపెనీ టెక్ మహీంద్రా దాన్ని సొంతం చేసుకోగలిగింది. అయితే అందరు భయపడ్డట్లు సత్యం కంప్యూటర్స్ ఏమీ మహీంద్రా గ్రూప్ ను ఇబ్బంది పెట్టలేదు సరికదా టెక్ మహీంద్రా సేవలు ప్రపంచ వ్యాప్తం చేయడం లో సఫలీకృతం ఐంది.
అందుకే, ఈ సారి ఎలాగైనా అవకాశాన్ని చేజారనీయ రాదని భావించిన నాయక్... మైండ్ ట్రీ కొనుగోలులో పట్టుదలకు పోయారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం మైండ్ ట్రీ కొత్త సారథి కోసం ఎల్ అండ్ టీ వేట ప్రారంభించింది. వీలైనంత త్వరగా ప్రమోటర్, సీఈఓ ఐన రోస్టో రావణన్ ని బయటకు పంపించేయాలి ఎల్ అండ్ టీ తలపిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ లోపలి వ్యక్తితో పాటు బయటి వారిని కూడా ఇందుకోసం ఇంటర్వ్యూ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త సీఈఓ ను నియమించటమే కాకుండా పాత ప్రమోటర్లు నియమించిన కీలక అధికారులను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఎల్ అండ్ టీ సొంత సాఫ్ట్ వేర్ కంపెనీ ఐన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లో ప్రస్తుతం కొనుగోలు చేసిన మైండ్ ట్రీ కంపెనీని విలీనం చేస్తారట. ఒకటి రెండేళ్ల లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే , మైండ్ ట్రీ కి ఇప్పటి వరకు ఉన్న కస్టమర్లు వారి కాంట్రాక్టు లను రెన్యువల్ చేసుకొనేందుకు అవకాశం ఉండటం తో ఈ ఏడాది మైండ్ ట్రీ రెవిన్యూ, లాభాలు తగ్గే అవకాశాలు కొట్టి వేయలేమని స్టాక్ మార్కెట్ అనలిస్టులు పేర్కొంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications