ముంబై/హైదరాబాద్ : నిర్మాణాలకు అత్యంత కీలకమైంది సిమెంట్. దేశ వ్యాప్తంగా సిమెంట్ తయారీ పరిశ్రమలు అనేకం ఉన్నప్పటి దానికి డిమాండ్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ తో పాటు హైదరాబాద్ వంటి మహానగరాల్లో సిమెంట్ ధర ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇతర నగరాల్లో సిమెంట్ ధర కాస్త తక్కువగా ఉన్నప్పటికి నిర్మాణాలు అతి వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రం సిమెంట్ కంపెనీల మద్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది.

మూడో త్రైమాసికంలో పుంజుకొనే అవకాశం..! సిమెంట్ అమ్మకాలపై కంపెనీల ఆశాభావం..!!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) సిమెంట్ డిమాండ్‌లో వృద్ధి 7 శాతం నమోదుకావడానికి అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రాజెక్టుల పనులు నెమ్మదిగా సాగిన కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సిమెంట్ డిమాండ్ అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. అయితే వర్షాకాలం ముగిసిన తర్వాత మూడో త్రైమాసికంలో గిరాకీ పుంజుకోవడానికి అవకాశం ఉందని, మొత్తంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం డిమాండ్‌లో 7 శాతం వృద్ధి నమోదుకావచ్చని తెలిపింది.

పెరిగిన సిమెంట్ ఉత్పత్తి..! రెండవ త్రైమాసికంలో వర్షాల కారణంగా పడిపోయిన కొనుగోళ్లు..!!
క్రితం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 13 శాతంగా నమోదైంది. గత ఏప్రిల్‌లో సిమెంట్ ఉత్పత్తి 28.7 మిలియన్ టన్నులుగా ఉంది. మార్చితో పోల్చితే ఇది 13.3 శాతం తక్కువ. 'ఎన్నికల కారణంగా మొదటి త్రైమాసికంలో ప్రాజెక్టుల పనులు నెమ్మదిగా సాగాయి. రెండో త్రైమాసికం విషయానికొస్తే.. వర్షాలతో డిమాండ్ తక్కువగా ఉంటుంది. మూడో త్రైమాసికం నుంచి డిమాండ్ పుంజుకుంటుందని భావిస్తున్నాం. గృహ నిర్మాణం, రోడ్లు, రైల్వే, నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి డిమాండ్ ఏర్పడనుంది' అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సభ్యసాచి మజుందార్ తెలిపారు.

మార్జిన్ల రికవరీ..! ఆశాజనకంలో కంపెనీలు..!!
కంపెనీల లాభదాయకత విషయానికొస్తే.. మొదటి త్రైమాసికంలో అధిక స్థాయిలో సిమెంట్ ధరలు ఉండటం, తక్కువ స్థాయిలో విద్యుత్ చార్జీలు, ఇంధనం, సరుకు రవాణా వ్యయాలు ఉన్నందు వల్ల మార్జిన్ల రికవరీకి అవకాశం ఏర్పడింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు 18-20 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని జత చేసుకునే అవకాశం ఉందని ఇక్రా అంచనా వేస్తోంది. అధిక సప్లయ్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామర్థ్య వినియోగం 71 శాతం స్థాయిలో ఉండనుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 69 శాతంగా ఉంది.

ఢిల్లీ, హైదరాబాద్‌లో అధిక ధర..! డిమాండ్ కూడా ఎక్కువే..!!
గత ఏప్రిల్‌లో సిమెంట్ ధరలు ఇంతకు ముందు సంవత్సరం ఇదేనెలకన్నా ఎక్కువగా ఉన్నాయి. అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ, హైదరాబాద్ ధరలు 20-25 శాతం, ముంబైలో 10 శాతం పెరిగాయి. మార్చిలోనే కంపెనీలు సిమెంట్ ధరలను పెంచాయి. ఏప్రిల్‌లో స్థిరపడ్డాయి. అయితే డిమాండ్ తగ్గడం, సరఫరాపరమైన ఒత్తిడుల కారణంగా దక్షిణాది మార్కెట్లలో జూన్‌లో ధరలు తగ్గాయి. బొగ్గు, పెట్ కోక్ ధరలు తగ్గిన ఫలితంగా కంపెనీలపై ఖర్చుల ఒత్తిడి తగ్గింది. అధిక స్థాయిలో సిమెంట్ ధరలు ఉండటం, తక్కువ స్థాయిలో ముడిసరుకుల ధరలు ఉన్నందు వల్ల మొదటి త్రైమాసికంలో కంపెనీల లాభాదాయకత పెరిగి ఉండవచ్చని ఇక్రా పేర్కొంది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications