అవును మీరు విన్నది నిజమే. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి తన కస్టమర్ కోసం వినూత్న రీతిలో కొత్త ఇన్వెస్ట్మెంట్ పథకాలను ప్రవేశ పెడుతోంది. ఇందులో భాగంగానే స్విగ్గి సూపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ ఎస్ ఐ పీ ) పేరుతో ఈ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది.
ఇందులో పెట్టుబడి పెట్టేందుకు కూడా ఎలాంటి రిస్క్‌లు లేవని, దస్తావేజులు చదవాల్సిన పని లేదంటూ వినియోగదారులను మరింత ఊరిస్తోంది. మార్కెట్ రిస్కులకు లోబడని ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి లహ పడనుందని తన కస్టమర్లుని కోరుతోంది.

భారత ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో స్విగ్గి, జొమాటో రెండు సంస్థలూ రారాజులుగా వెలుగొందుతున్నాయి. వందలాది నగరాలూ పట్టణాల్లో విస్తరించి లక్షలాది రెస్టవురెంట్స్ నుంచి కోట్లాది మందికి రోజూ ఆహారాన్ని చేరవేస్తున్నాయి. అందుకే ఈ యాప్ లకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
ఈ రెండు కంపెనీల్లోకి వేళా కోట్లా పెట్టుబడులు వచ్చి చేరాయి. మరిన్ని పెట్టుబడుల కోసం ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడి దారులతో రెండు సంస్థలూ చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యం లో స్విగ్గి ఇలాంటి ఆఫర్ పెట్టడం తో ఇన్వెస్టర్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ స్విగ్గి మార్కెట్ రిస్క్ లేని పెట్టుబడి అవకాశం కల్పిస్తే పెట్టుబడి పెట్టడానికి చాల మంది రెడీగా ఉంటారు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ దాగుంది.
2014 లో కేవలం 14 మంది డెలివరీ బాయ్స్ తో బెంగళూరు లో ప్రారంభమైన స్విగ్గి దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ... ప్రస్తుతం దాదాపు 2 లక్షల మంది డెలిరి బాయ్స్ ను కలిగి ఉంది. దేశంలోని 200 పైగా నగరాలూ పట్టణాల్లో తన సేవలను అందిస్తూ లక్షకు పైగా హోటల్స్, రెస్టవురెంట్స్ లో నుంచి ఫుడ్ ను సరఫరా చేస్తోంది. ఇప్పటికే 1 బిలియన్ డాలర్ కు పైగా వాల్యూయేషన్లతో యునికార్న్ గ ఎదిగిన స్విగ్గి ప్రస్థానం ఇండియన్ స్టార్టప్ లకు గర్వ కారణమే.
అయితే ఎంత ఎదిగినా ఈ సంస్థ ఇప్పటి వరకు లాభాలు అన్న మాట ఎరుగదు. వందల కోట్ల లో నష్టాలను మూటగట్టుకొంటోంది. ఐన ఇన్వెస్టర్ల మనసు గెలుస్తోంది. అయితే, స్విగ్గికి అంత అత్యవసరంగా వినియోగదారుల నుంచి పెట్టుబడి సమకూర్చుకోవాల్సిన అవసరం ఎం వచ్చిందని ఆరా తీస్తే... తన వినియోగదారులను వినూత్నంగా ఆకట్టుకోవడం లో భాగమే ఈ సరి కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని తేలింది.
ఈ నెల 28వ తేదీన స్విగ్గి ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ పెట్టుబడి పథకం గురించిన మెయిల్స్ పంపింది. కానీ ఇవి నిజమైన పెట్టుబడి సాధనాలు కావని యాప్ ఓపెన్ చేస్తే కానీ కస్టమర్లకు అర్థం కాదు. కొంత గందరగోళానికి గురికాక తప్పదు. తన యాప్ లో వచ్చే డిస్కౌంట్స్ నే సేవింగ్స్ గా స్విగ్గి చూపించే ప్రయత్నం చేసింది.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక మార్కెటింగ్ వ్యూహాలు ఉండొచ్చు కానీ.. ఇలా ఏకంగా దీన్ని ఒక పెట్టుబడి సాధనంగా చూపించడం బాగాలేదని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications