25 స్టార్టప్ సంస్థల సక్సెస్ స్టోరీస్ !

హైదరాబాద్. న్యూ స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇదీ ఇప్పుడు టెక్ వాల్డ్‌లో వినిపిస్తున్న మాట. ఐదేళ్ల క్రితం స్టార్టప్ స్టేట్‌గా మొదలైన తెలంగాణలో ఇప్పుడు 3వేలకుపైగా అంకుర సంస్థలు ఉన్నాయి. ఐదారేళ్ల క్రితం వరకూ వీటి గురించి పెద్దగా పట్టించుకోని పెద్ద సంస్థలు కూడా హైదరాబాద్ స్టార్టప్స్‌పై దృష్టిపెట్టారు. ఈ నేపధ్యంలో హైదారాబాద్‌లోనే పుట్టి హైదారాబాద్‌లో పెరిగి పెద్దవై అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించిన 25 స్టార్టప్స్‌ను గుర్తించింది ఈ-యంత్రా అనే సంస్థ.

మేడ్ ఇన్ హైదరాబాద్‌ పేరుతో తయారైన ఈ పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు ఆవిష్కరించారు. వందలాది పారిశ్రామికవేత్తలు, వేలాది మంది ఔత్సాహికుల మధ్య లాంఛ్ అయిన ఈ బుక్‌కు సీక్వెల్‌గా మహిళా పారిశ్రామికవేత్తలతో పుస్తకాన్ని తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు.

ఈ బుక్‌లో ఎవరెవరున్నారు

ఈ బుక్‌లో ఎవరెవరున్నారు

25 మంది స్టార్టప్స్‌ను గుర్తించి, వాళ్ల ప్రత్యేకతలు, సక్సెస్ మంత్ర, యువతకు వాళ్లు ఇచ్చే సందేశంతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఇందులో జిప్పర్, గ్రాబ్ ఆన్, ది చాక్లెట్ రూమ్, సైకుల్, హుసిస్ కన్సల్టింగ్, ఇమాజినేట్, నెంబర్ మాల్, లెర్న్ పీడియా, మేరా ఈవెంట్స్, గ్రామినెర్, పేస్విఫ్ట్ సొల్యూషన్స్, పాపికార్న్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్, జాగిల్, హగ్ ఇన్నోవేషన్స్, బెన్ ఫ్రాంక్లిన్ ఆప్టీషియన్స్, క్వాక్ క్వాక్, జెన్ వర్క్, మై స్మార్ట్ ప్రైస్, సెంట్రో, పల్సస్, కంట్రోల్ ఎస్, కార్జ్, నెఫ్రో ప్లస్, నుక్కడ్ షాప్స్ ఉన్నాయి.

ఎందుకు ఈ బుక్ ?

ఎందుకు ఈ బుక్ ?

''స్టార్టప్స్, టెక్నాలజీ కంపెనీల గురించి చెప్పాలంటే మొదట అంతా బెంగళూరు గురించే మాట్లడతారు. ఇక్కడ ఎన్ని విజయవంతమైన కథనాలు ఉన్నా జాతీయ మీడియాకు పెద్దగా పట్టదు. ఇక్కడి ఆంట్రప్రెన్యూరియల్ సిస్టమ్‌ను, ప్రభుత్వ చొరవను చూసిన తర్వాత నేనే ఎందుకు ఆ ప్రాజెక్టును టేకప్ చేయొద్దు అని అనిపించింది. అందుకే కొంత మంది కోర్ టీమ్‌తో కలిసి మేడ్ ఇన్ హైదరాబాద్ బుక్‌ను తీసుకువచ్చాం. కఠినమైన నిబంధనలు, జ్యూరీ సలహాలతో మొదటి పుస్తకం కోసం 25 మందిని ఎంపిక చేశాం. ఒకొక్కరి స్టోరీ నుంచి ఒకొక్క విషయాన్ని తప్పకుండా ప్రతీ ఒక్కరూ నేర్చుకోవచ్చు. రూ.300తో వ్యాపారాన్ని మొదలుపెట్టిన వాళ్లు ఒకరైతే, మూతబడిందనుకున్న వ్యాపారాన్ని మల్టీమిలియన్ స్థాయికి తీసుకెళ్లడం మరొకటి. ఇలా ప్రతీ స్టోరీ చదివిన తర్వాత ఎంతో స్ఫూర్తి పొందుతాం '' - ఫణి రాజ్, ఈ యంత్ర ఫౌండర్. పుస్తక పబ్లిషర్.

త్వరలో టి హబ్ ఫేజ్ 2, మెంటార్ నెట్వర్క్

త్వరలో టి హబ్ ఫేజ్ 2, మెంటార్ నెట్వర్క్

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 3.5 చదరపు అడుగుల్లో టిహబ్ రెండో దశను నిర్మిస్తున్నట్టు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ప్రకటించారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ లేదని, ఆ ఘనత తెలంగాణకే దక్కబోతోందని ఆయన వివరించారు. త్వరలో చిన్న సంస్థలకు చేయూతను ఇచ్చే విధంగా మెంటర్ నెట్వర్క్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. తెలంగాణలో సక్సెస్ అయి ఇతరులకు మార్గదర్శకంగా నిలిచే సంస్థల అధిపతులతో భేటీ అయి వాళ్లందరినీ మెంటర్ నెట్వర్క్ పరిధిలోకి తీసుకువస్తామని జయేష్ తెలిపారు. మొదటగా ఈ బుక్‌లో ఫీచర్ అయిన 25 మందిని ఆహ్వానిస్తున్నామని, అందరూ తప్పకుండా సహకరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందినా కొన్ని సంస్థలు ఈ చిన్నపాటి సాయం చేయడానికి కూడా వెనుకాడడం బాధగా ఉందని చురకలు అంటించారు.

మేడ్ ఇన్ హైదరాబాద్‌ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్ట్ ఎం. సోమశేఖర్‌తో పాటు సత్య అయ్యగారి, సురేష్ ధరూర్, వర్ష బిల్గిరి, సుష్మ నాయక్, నేహా జా రచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+