కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌తో పాటు చిన్న తరహా సేవింగ్స్‌పై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. తగ్గించిన వాటిల్లో పోస్టాఫీసులు ఇచ్చే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి స్కీం వంటివి ఉన్నాయి. మరి ఈ సమయంలో వీటిని కొనసాగించాలా అనేదే చాలా మంది మధ్యతరగతి వర్గాల్లో ప్రశ్న. అంతే కాదు రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు మరింతగా తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఏం చేయాలో తెలుసుకోండి.

0.1 శాతం వడ్డీ తగ్గింది
కేంద్ర ఆర్థిక శాఖ ప్రతీ మూడు నెలలకు ఓ సారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. అందులో భాగంగా జూలై - సెప్టెంబర్ క్వార్టర్ కాలానికి వివిధ చిన్న తరహా పెట్టుబడులపై వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే గత రెండు ఆరు కాలంలో ఆర్బీఐ మాత్రం తన వడ్డీ రేట్లను ఏకంగా 0.75 శాతం తగ్గించింది. ఆ లెక్కన చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం తగ్గించిన రేట్లు నామమాత్రమనే చెప్పాలి.
ఇప్పుడు జూలై - సెప్టెంబర్ క్వార్టర్ మధ్య ఏడాదికి పిపిఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ పై వచ్చే వడ్డీ 8 నుంచి 7.9 శాతానికి తగ్గింది. ఇక కిసాన్ వికాస్ పత్రాల్లో వడ్డీ 7.7 నుంచి 7.6 శాతానికి తగ్గింది. దీని వల్ల సదరు బాండ్ల మెచ్యూరిటీ 112 నెలల నుంచి 113 నెలలకు పెరుగుతుంది.
ఇక సుకన్య సమృద్ధి స్కీం వడ్డీ ఇప్పుడు 8.5 శాతానికి బదులు 8.4 శాతం వడ్డీని అందిస్తుంది. ఐదేళ్ల పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ 7.3 నుంచి 7.2 శాతానికి తగ్గనుంది. పోస్టాఫీసుల్లో ఇచ్చే ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ కూడా 8.7 నుంచి 8.6 శాతానికి తగ్గనుంది.

ఇప్పటికీ ఆకర్షణీయమే
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వడ్డీ రేట్లను 0.1 శాతం తగ్గించినప్పటికీ భవిష్యత్తులోనూ ఇవి తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే.. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఆకర్షణీయంగానే ఉన్నాయి. ఎలాంటి రిస్క్ వద్దు అనుకునే వాళ్లకు ఇవి బెస్ట్ ఆప్షన్స్. ఆడపిల్లలకు పనికొచ్చే సుకన్య సమృద్ధి నుంచి సీనియర్ సిటిజన్స్‌కు ఉపయోగపడే పోస్టల్ సేవింగ్స్ స్కీమ్ వరకూ అన్నీ 7 శాతానికిపైగానే వడ్డీని అందిస్తున్నాయి. బ్యాంకులు అందించే ఫిక్సెడ్ డిపాజిట్ల కంటే కాస్త తక్కువైనా రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్స్.

ఎలాంటి ప్లానింగ్ అవసరం ?
ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు మరింతగా తగ్గొచ్చు అనే అంశాన్ని ప్రతీ ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం నాలుగు శాతం లోపే ఉంది. మంచి వర్షపాతం నమోదైతే వడ్డీ రేట్లు పెరగడం కష్టం. అందుకే భవిష్యత్తు కోసం మనం వేసుకున్న ప్రణాళికలకు సంపూర్ణంగా డబ్బు సమకూరాలంటే మన ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications