డబ్బు లేనిదే పూట గడవని పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకోసమే ఇంటి పెద్ద ఒక్కరే కాకుండా మిగతా వారు కూడా ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదించాల్సి వస్తోంది. అయితే సంపాదించినదానిలో కొంతమొత్తాన్ని భవిష్యత్ అవసరాలకోసం పొదుపు చేసుకునే వారు కొందరుంటారు. మరికొందరు ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి తమ వద్ద ఉన్న సొమ్మును అధిక రాబడిని ఇచ్చే సాధనాల్లో పెట్టుబడిగా పెట్టాలనుకుంటారు.
ఇలాంటి వారు కొంత రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే కాకుండా దీర్ఘకాలంలోనూ వాటి ప్రతిఫలాలు అందుతాయి. ఈ పెట్టుబడుల కోసం పలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. మీరు పెట్టే పెట్టుబడుల మూలంగా భవిష్యత్తులో మీ మూలధనం వృద్ధి చెందుతుంది. లేదా మీకు మంచి వడ్డీరేటు అందుతుంది. లేదా డివిడెండ్ వస్తుంది. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి కాబట్టి ఇలాంటి వారు భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది.

ఇవి పెట్టుబడుల్లో ఉన్న రకాలు
పెట్టుబడులపై ఏ మాత్రం అవగాహన లేని వారు లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారు తమ వద్ద ఉన్న సొమ్మును తెలిసిన వారికి వడ్డీకి ఇస్తుంటారు. తీసుకున్న వారు సక్రమంగా వడ్డీ చెల్లిస్తే ఇబ్బంది ఉండదు. లేక పోతే గొడవలు మొదలవుతాయి. ఇలాంటి ఇబ్బంది ఎందుకు అనుకుంటే పోస్టాఫీసుకు వెళ్లి పొదుపు ఖాతా తెరుస్తారు. లేదా తమకు బ్యాంకు అందుబాటులో ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. లేదా జీవిత బీమా పాలసీ తీసుకుంటారు. ఇలాంటివే చాలా మందికి తెలిసినవి. కానీ నగరాల్లో ఉండే విద్యావంతులకు అనేక విషయాలపై అవగాహన ఉంటుంది. వారు పెట్టుబడులు పెట్టి తమ సంపదను పెంచుకోవడానికి తగిన అవకాశాలు ఉన్నాయి. అవేమిటంటే..
1. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు
2. మ్యూచువల్ ఫండ్స్
3. స్వల్పకాలిక పెట్టుబడులు
4. దీర్ఘకాలిక పెట్టుబడులు
5. క్రమానుగత పెట్టుబడి పథకాలు (సిప్)
6. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్సు ప్లాన్ (యులిప్స్)
7. పెన్షన్ ప్లాన్లు

పెట్టుబడులు చాలా సులభం
* ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చాలా సులభంగా మారిపోయాయి. మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో క్షణాలూ షేర్ల ధరలు తెలుసుకుంటూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటోంది.
* మ్యూచువల్ ఫండ్స్ లోను పెట్టుబడులు సులభముగా మారాయి.
* ఎక్కువ సొమ్ము లేనివారు నెలవారీగా నిర్ణీత మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిప్ లు వచ్చాయి.

ప్రయోజనాలు
* పెట్టుబడుల వల్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. ఫలితంగా మీరు ఆర్థికంగా మరింత ముందుకు సాగుతారు.
* కారు, ఇల్లు లేదా ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయాలన్న డబ్బు తప్పనిసరి. ఇలాంటి లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే పెట్టుబడులు తప్పనిసరి.
*నగదు విలువ తగ్గిపోతోంది. ఇప్పుడున్న విలువ ఐదేళ్ల తర్వాత ఉండదు. ధరలు భగ్గుమంటున్నాయి. కాబట్టి మీ సంపాదన భవిష్యత్ అవసరాలకు సరిపోదు. కాబట్టి ఇప్పటి నుంచి పెట్టుబడులు పెడితేనే మీ భావి అవసరాలు తీరడానికి అవకాశం ఉంటుంది.
* మీ వద్ద ఉన్న సొమ్మును పెట్టుబడిగా పెడితే అది అనేక సమయాల్లో ఆదుకుంటుంది. అత్యవసరంగా సొమ్ము అవసరమైనా , ఆస్పత్రిలో చేరినా ఈ సొమ్ము ఉపయోగ పడుతుంది.
* బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పెట్టడం ద్వారా దానిపై వచ్చే రాబడి చాలా తక్కువగా ఉంటుంది. కానీ విభిన్న పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ సంపదను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది.
* ద్రవ్యోల్బణం పెరుగుతోంది కాబట్టి దాన్ని తట్టుకోవడానికి పెట్టుబడులు ఉపయోగపడతాయి.
* పెట్టుబడుల ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది.
అందుకే పెట్టుబడులపై వీలైనంత తొందరగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్ లో మీకు మంచి ఫలితాలు అందడానికి అవకాశం ఉంటుంది. బీ రెడీ ...


Click it and Unblock the Notifications