ఏపీలో కంపెనీల వివాదాల పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీలకు సంబంధించిన వివాదాల పరిష్కరణ సత్వరం చెయ్యటం కోసం నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) బెంచ్‌ ఏర్పాటు కానుంది. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ఈ బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నారు.క్వాజీ జ్యుడీషియల్‌ అధికారాలు ఉండే ఈ సంస్థ కంపెనీలకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుంది. . ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఎన్‌సీఎల్‌టీకి ఇప్పటికే దేశ వ్యాప్తంగా 14 బెంచ్‌లున్నాయి.

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎక్కడైనా మరో బెంచ్‌ ఏర్పాటుచేయాలని ఎన్‌సీఎల్‌టీ పరిశీలనకు వచ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) యొక్క రెండు కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేయడానికి గత మార్చి నెలలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి వద్ద, మరొకటి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పెట్టాలని నిర్ణయించింది . పెరుగుతున్న కంపెనీల వివాదాల భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది .

Establishment of NCLT Bench to resolve company disputes in AP

ముఖ్యంగా దివాలా చట్టం & దివాలా కోడ్ 2016 కింద అమరావతిలో బెంచ్ యొక్క అధికార పరిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కంపెనీల వివాదాలు హైదరాబాద్‌లోని ఎన్‌సిఎల్‌టి బెంచ్ పరిధిలోకి వస్తున్నాయి . దానిని తెలంగాణాకు పరిమితం చేసి ఇప్పుడు మంగళగిరిలోని ఏపీఐఐసీ ఎన్‌సిఎల్‌టి బెంచ్ ఏర్పాటు కానుంది . కొత్త బెంచీల ఏర్పాటు కేసులను వేగంగా పరిష్కరించేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. దీంతో మంగళగిరిలో ఏపీఐఐసీ నూతన భవనాన్ని చూసి ఇక్కడ పెట్టాలని నిర్ణయించారు. ఏపీఐఐసీ భవనంలోని 10,000 చదరపు అడుగుల ప్రాంతాన్ని ఈ బెంచ్‌ ఏర్పాటు కోసం లీజుకు ఇవ్వనున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+