గుక్కెడు నీటి కోసం చెన్నై అలమటిస్తోంది. ఇక రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. నీళ్ల కోసం జనాలు కళ్లనీళ్ల పర్యంతమయ్యే స్థితి దాపురించింది. తమిళ తంబీల కన్నీటి వ్యధ చూసి బెంగళూరు కాస్త ముందు జాగ్రత్త పడ్తోంది. ఈ రోజు కాకపోతే రేపైనా సరే.. తమకూ ఈ దుస్థితి తప్పదనే ఉద్దేశంతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కొత్త అపార్ట్‌మెంటుల నిర్మాణాన్ని ఆపేయాలని యోచిస్తోంది.

నిర్మాణం ఆపేయడమే పరిష్కారమా ?
ప్రధానంగా బెంగళూరు పరిధి నానాటికీ విస్తరిస్తోంది. రోజూ 1500 కొత్త వాహనాలు బెంగళూరు రోడ్లపైకి అడుగు పెడ్తున్నాయి. మౌలిక సదుపాయాల విషయంలో బెంగళూరు తీసికట్టుగా మారుతోంది. వాస్తవానికి ఆ స్థాయిలో వృద్ధి ఉంటే.. ఏ ప్రభుత్వమైనా కొత్త సౌకర్యాలను కల్పించడం అసాధ్యమైన పనే. ప్రస్తుతం ఒక్క బెంగళూరు నగరంలోనే 75 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. జనాభా ఎప్పుడోనే కోటి దాటిపోయింది. చుట్టుపక్కల జిల్లాలను కూడా తనలో మింగేసుకున్న బెంగళూరు ఇంకా ఎంతగా విస్తరిస్తుందో చెప్పడం కష్టమే. దేశ టెక్నాలజీ దిగ్గజ నగరంగా పేరొందిన బెంగళూరులో ఇప్పటికే నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మరీ చెన్నై అంత దుస్థితి లేకపోయినా నీళ్ల లభ్యత మాత్రం కష్టంగానే ఉంది. అందుకే తాత్కాలిక పరిష్కారంగా ఐదేళ్ల పాటు అపార్ట్‌మెంటుల నిర్మాణంపై ఆంక్షలను విధించడమో, లేక పూర్తిగా ఆపేయడమో చేయాలని యోచిస్తోంది కర్నాటక సర్కార్. ఈ అంశాన్ని సాక్షాత్తూ బెంగళూరు డిప్యూటీ ముఖ్యమంత్రి, బెంగళూరు ఇన్‌ఛార్జ్ మినిస్టర్ జి. పరమేశ్వర అధికారికంగా వెల్లడించారు. వేగంగా పూర్తవుతున్న నిర్మాణాలకూ.. ప్రభుత్వం అందించే సౌకర్యాలకూ పొంతన లేకుండా పోతోందని, అందుకే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెబ్తున్నారు. ఒక వేళ ఇదే జరిగితే పర్యావరణ పరంగా నిజంగా హర్షించాల్సిన అంశమే. కానీ అక్కడి మార్కెట్‌కు మాత్రం పెద్ద దెబ్బ పడ్తుంది.

ప్రత్యామ్నాయాలు లేవా
బెంగళూరు నగరం ఎప్పటి నుంచో పచ్చదానికి కేరాఫ్ అడ్రస్. ఒకప్పుడు దాన్ని పెన్షనర్స్ ప్యారడైజ్ అనేవారు. ఎందుకంటే చల్లటి గాలి, ఆహ్లాదమైన వాతావరణం ఉండేది. కానీ పదేళ్లుగా అది పూర్తిగా పాడైపోయింది. ఎక్కడ చూసినా ఆకాశ హర్మ్యాలు, ట్రాఫిక్ జామ్స్‌తో నగరంగా దుర్భరంగా మారుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం నీళ్ల విషయంలో ఎలాంటి ప్రత్యేక శ్రద్ధా తీసుకోవడం లేదని జనాల మాట. చుట్టుపక్కల జిల్లాల నుంచి నీళ్లను తెచ్చి బెంగళూరుకు తరలిస్తున్నారు తప్ప.. ఉన్న ఎన్నో నీటి కుంటలను, చిన్నపాటి సరస్సులను పూర్తిగా మరిచిపోయినట్టు నగర జీవి ఆగ్రహంతో ఉన్నాడు. వాటర్ బాడీస్‌లో నిర్మాణాలకు అనుమతులిస్తూ, ఉన్న కొన్నింటిలో మురుగు నీరు కలిపేస్తూ వాటిని నాశనం చేస్తున్నట్టు మండిపడ్తున్నారు. అందుకే మొదట వాటిని పరిరక్షించడం కూడా ప్రయార్టీగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఉంటుందా
ఒక వేళ ఐదేళ్ల పాటు కొత్త అపార్ట్‌మెంట్స్ నిర్మాణంపై బ్లాంకెట్ బ్యాన్ విధిస్తే తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది. గత నాలుగైదేళ్లుగా ఒక్క హైదరాబాద్ తప్ప మిగిలిన మెట్రో నగరాల్లో రియల్ బూమ్ ఎక్కడా లేదు. ధరలు కూడా తగ్గుముఖం పడ్తున్నాయి. అలాంటి స్థితిలో ఇలాంటి నిషేధాలు పుండుపై కారం చల్లినట్టు అవుతుందనే వాదన ఉంది. ఇది పక్కనబెడితే.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప భవిష్యత్తే ఉండబోదనేది పర్యావరణ వేత్తల మాట. మొత్తానికి బెంగళూరు ఇప్పటికైనా మేలుకుంది. హైదరాబాద్ లాంటి నగరంపై ప్రభుత్వం ముందు జాగ్రత్తపడాలి. లేకపోతే ఏం జరగొచ్చో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మీరు కూడా మా గొంతును వినిపించండి. ప్రభుత్వానికి మీ సలహాలను కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications