న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5వ తేదీన లోకసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురువారం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో ఆయన నివాసంలో కలిశారు. మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు బడ్జెట్ పైన సూచనలు, సలహాలు తీసుకొని ఉంటారా అనే చర్చ కొనసాగుతోంది. వారి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది తెలియరాలేదు. మన్మోహన్ 2004 - 2014 వరకు ప్రధానిగా పని చేశారు.
అంతకుముందు 1991-1996 మధ్య దివంగత ప్రధాని పీవీ నరసింహా రావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. పీవీ-మన్మోహన్ ద్వయం పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది. 1991లో కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణల్లో కీలక భూమిక పోషించారు. 15 సెప్టెంబర్ 1982 నుంచి 15 జనవరి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పని చేశారు. 1985 నుంచి 1987 వరకు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు.

నిర్మలా సీతారామన్.. మన్మోహన్ సింగ్‌ను కలవడంపై మీడియాలో, రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇలా కలవడం మంచి పరిణామమని, ఇలాంటి అంతర పార్టీ సమావేశాల వల్ల ఆయా పార్టీల మధ్య స్నేహం విరియడంతో పాటు, సామాన్యులకు మరింత మంచి ప్రయోజనాలు చేకూరే పరిష్కారాలు లభిస్తాయని అంటున్నారు.
ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్ సింగ్ పేరుగాంచారని, అలాంటి వారిని నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా కలవడం మంచి పరిణామమని పేర్కొంటున్నారు. మన్మోహన్ గ్రేట్ థింకర్, ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్ అని, ఆయన నుంచి నిర్మలా సూచనలు తీసుకోవడం మంచి అంశమని అంటున్నారు.


Click it and Unblock the Notifications