For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారాంతంలో మళ్లీ నీరసం, 11800 దిగువకు నిఫ్టీ

By Chanakya
|

వారాంతంలో స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ దిగాలు పడ్డాయి. నిన్న కాస్త నిలదొక్కుకున్నట్టు కనిపించిన మార్కెట్ ఈ రోజు మాత్రం పట్టుకోల్పోయింది. నిఫ్టీ మళ్లీ 11800 పాయింట్ల మార్కును నిలబెట్టుకోలేకపోయింది. నిన్న స్థిరంగా కనిపించిన బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు 150 పాయింట్లకు పైగా కోల్పోయింది. అంతర్జాతీయ మార్కట్ల నుంచి నెగిటివ్ న్యూస్‌తో పాటు మళ్లీ డిహెచ్ఎఫ్ఎల్ ఇబ్బందులు మార్కెట్లను కూలదోస్తాయోమో అనే ఆందోళన కారణమైంది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు.. మిడ్ సెషన్ తర్వాత నీరసించింది. ముఖ్యంగా ఆఖరి అరగంటలో మరింత కుంగిపోయాయి. చివరకు సెన్సెక్స్ 192 పాయింట్లు కోల్పోయి 39394 దగ్గర, నిఫ్టీ 53 పాయింట్లు కోల్పోయి 11788 దగ్గర ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 31,105 దగ్గర స్థిరపడింది.

గెయిల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్, భారతి ఇన్ఫ్రాటెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా నష్టపోయిన షేర్ల జాబితాలో చేరాయి.

Nifty ends below 11,800, Sensex down 191 pts

మళ్లీ డిహెచ్ఎఫ్ఎల్ కష్టాలు
ఈ నెల 29న ఆర్థిక ఫలితాలను వెల్లడించాల్సి ఉన్న డిహెచ్ఎఫ్ఎల్ మళ్లీ వాటిని వాయిదా వేసింది. ఇప్పటికే గడువు కోరి ఆలస్యం చేసిన సంస్థ.. మరోసారి వాటిని వచ్చే నెలకు వాయిదా వేయడం ఆందోళన రేకెత్తించింది. దీంతో స్టాక్ పదిహేను శాతం వరకూ పతనమైంది. చివరకు 12 శాతం నష్టంతో రూ.72 దగ్గర క్లోజైంది. వీటికి తోడు రుణాలు ఇచ్చిన దాతలు కన్సార్టియంలా ఏర్పడి ఏ విధంగా అప్పులను వసూలు చేయాలి అనే అంశంపై చర్చించడం కూడా స్టాక్ పతనానికి మరో కారణమైంది.

ప్రైవేట్ బ్యాంకుల బాధ
మొన్నటికి మొన్న కొద్దిగా రికవర్ అయినట్టు అనిపించిన యెస్ బ్యాంక్ ఈ రోజు మరో 4 శాతం కోల్పోయింది. ఇంట్రాడేలో రూ.107.60కి పడిపోయి చివరకు రూ.109 దగ్గర క్లోజైంది.

ఇదే బాటలో ఇండస్ ఇండ్ 3 శాతం నష్టపోయింది. ఎన్‌బిఎఫ్‌సికి చెందిన ఎం అండ్ ఎం ఫైనాన్స్ 3.5 శాతం, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.2 శాతం దిగొచ్చాయి.

ప్రభుత్వ బ్యాంకుల్లో జోరు
ప్రైవేట్ బ్యాంకులు నీరసంగా ఉంటే.. పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో మాత్రం ఈ రోజు ఉత్సాహం నమోదైంది. కెనెరా బ్యాంక్ 2 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2 శాతం పెరిగాయి. మిడ్ క్యాప్ స్పేస్‌లో కార్పొరేషన్ బ్యాంక్ 7 శాతం, యునైటెడ్ బ్యాంక్ 6 శాతం, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 5 శాతం పెరిగాయి.

అనిల్ అంబానీ కష్టాలు తీరేలా లేవు పాపం
జూలీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తొలగించిన అనేక స్టాక్స్‌లో అడాగ్ స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటికి తోడు అంత సులువుగా పరిష్కారం కాని అనేక సమస్యల నేపధ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా 7 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 6.5 శాతం నష్టపోయాయి. రిలయన్స్ పవర్ 5 శాతం, రిలయన్స్ హోం ఫైనాన్స్ 9 శాతం నీరసించాయి.

ఏ రూపాకీ బాత్ హై
ఎనిమిది నెలల నుంచి కన్సాలిడేషన్‌లో కొనసాగుతున్న రూపా అండ్ కంపెనీ స్టాక్ ఈ రోజు హై జంప్ చేసింది. ట్రేడింగ్ వాల్యూమ్స్‌ ఏకంగా 50 రెట్లు పెరిగాయి. ఈ స్టాక్ వరుసగా మూడు రోజులుగా పెరుగుతున్నా ఈ రోజు మాత్రం భారీ లాభాలను నమోదు చేసింది. ఒక దశలో 18 శాతంవరకూ పెరిగిన స్టాక్ చివరకు 8 శాతం లాభాలకు పరిమితమైంది. రూ.255 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో లవబుల్ లింగరీ కూడా రెండు, మూడు సెషన్ల నుంచి దౌడు తీస్తోంది.

ముచ్చటగా మూడో రోజూ..
కాక్స్ అండ్ కింగ్స్ స్టాక్ ముచ్చటగా మూడో రోజూ పది శాతం డౌన్ సర్క్యూట్‌తో క్లోజైంది. రూ.150 కోట్ల విలువైన కమర్షియల్ పేపర్స్ డిఫాల్ట్ నేపధ్యంలో స్టాక్ పతనం కావడం తెలిసిన సంగతే. ఈ రోజు కూడా మరో 10 శాతం కోల్పోయిన స్టాక్ రూ.36 దగ్గర క్లోజైంది.

బెంగళూరు ఎఫెక్ట్
భవిష్యత్తులో మరింత నీటి కొరత ఎదురుకాకుండా బెంగళూరులో ఐదేళ్ల పాటు అపార్టుమెంట్ల నిర్మాణాన్ని ఆపేసే యోచనలో ఉన్నట్టు కర్నాటక డిప్యూటీ సీఎం చేసిన ప్రకటన రియల్ ఎస్టేట్ స్టాక్స్‌లో వణుకు పుట్టించింది. ఇది ప్రధాన మార్కెట్ కావడంతో ఒక దశలో శోభా డెవలపర్స్ 7 శాతం, పుర్వంకర 6 శాతం, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, ప్రెస్టీజ్ ఎస్టేస్ట్స్ 4 శాతం కోల్పోయాయి.

మీ కార్డులను కాపాడుకోవచ్చు ఇలా..మీ కార్డులను కాపాడుకోవచ్చు ఇలా..

English summary

వారాంతంలో మళ్లీ నీరసం, 11800 దిగువకు నిఫ్టీ | Nifty ends below 11,800, Sensex down 191 pts

Nifty ended 52.60 points below at 11,788.90, while Sensex was down 191.77 points at 39,394.64. About 1147 shares have advanced, 1354 shares declined, and 158 shares are unchanged.
Story first published: Friday, June 28, 2019, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X