న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంస్కరణకు తెరలేపింది. 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' విధానం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. పేద ప్రజలు ఎవరైనా అవసరార్థం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లినప్పుడు.. వారికి అందే సబ్సిడీ రేషన్ వస్తువులు పొందడంలో ఇబ్బందులుపడకుండా ఉండేందుకు దీనిని తీసుకు వస్తున్నారు.
ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆహార భద్రతపై సంబంధిత కార్యదర్శులు, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పోరేషన్ అధికారులతో గురువారం ఢిల్లీలో చర్చించారు. ప్రజా పంపిణీ విధానానికి సంబంధించి వ్యవస్థను కంప్యూటరీకరించడం, ఆహారధాన్యాల పంపిణీ, నిల్వల విషయంలో పారదర్శకత, ఎఫ్‌సీఐ, సీడబ్ల్యుసీ, ఎస్‌డబ్ల్యుసీ డిపోలను డిపో ఆన్‌లైన్ విధానంతో అనుసంధానం చేసే అంశాలపై చర్చించారు.

ఇలాంటి వారికి ఎంతో ప్రయోజనకరం
ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సౌకర్యాన్ని ఇప్పటికే తెలంగాణ, ఏపీ, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలు కల్పిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఏపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు ప్రజల వద్దకే చేర్చేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం మరో అడుగు ముందుకేసి, దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించేందుకు కసరత్తు చేయడం గమనార్హం. ఇది నిరుపేద, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఊరు, రాష్ట్రం.. ఇలా మారినప్పుడు కార్యాలయాల చుట్టు తిరిగే బాధలు తప్పుతాయి. ఇందుకోసం దేశమంతా పనిచేసేలా ఒకే రేషన్ కార్డు విధానం అమలు దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. కార్డుదారులందరికీ, ముఖ్యంగా ఉపాధి వెతుక్కుంటూ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్లే వలస కార్మికులకు వారికి ఎంతో ప్రయోజనకరం.

మరిన్ని రాష్ట్రాలకు IMPDS
ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ పీడీఎస్ (IMPDS) విధానం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ రాష్ట్రాల్లోని ప్రజలు రేషన్ సరుకులు ఆయా రాష్ట్రంలోని ఎక్కడైనా తీసుకునే వెసులుబాటు ఉంది. మరిన్ని రాష్ట్రాల్లో IMPDSను అమలు చేయనున్నారు. ఈ క్రమంలో ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు అమలు దిశగా ఆహార, ప్రజా పంపిణీ విభాగం రంగంలోకి దిగింది.

అవకతవకలకు ఆస్కారం లేకుండా...
రేషన్ కార్డుల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు కేంద్రస్థాయిలో కార్డుల సమాచారంతో ఒక వ్యవస్థను ఆహార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనుంది. ఇందులో ఆహార, ప్రజా పంపిణీ విభాగం చేసే పని కీలకం. కాగా, FCI, CWC, SWC, ఇతర ప్రయివేటు గోదాముల్లో 612 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను రేషన్ షాపుల ద్వారా ఏటా 81 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. సరుకుల కొనుగోలు నుంచి పంపిణీ వరకు అవినీతి లేకుండా చేసేందుకు సాంకేతికతను వినియోగించనున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications