తీవ్ర ఒడిదుడుకుల మధ్య జూన్ సిరీస్ నష్టాల్లో ముగిసింది. ఈ రోజు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ఉన్న నేపధ్యంలో మిడ్ సెషన్ తర్వాత ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగింది. డిసెంబర్ 2018 సిరీస్ తర్వాత మళ్లీ ఇప్పుడే అర శాతానికిపైగా నష్టాల్లో ఫ్యూచర్స్ ముగిశాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ ఆఖరి అరగంట వరకూ అత్యంత పటిష్టంగా కనిపించినప్పటికీ పట్టు కోల్పోయింది. 300 పాయింట్ల వరకూ లాభాల్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ కొన్ని క్షణాల్లోనే 200 పాయింట్లు కోల్పోయింది.
ఇక మిగిలిన విషయాలకు వస్తే.. ఈ రోజు సెక్టోరల్ ఇండిసిస్‌లో ఐటీ, మీడియా, మెటల్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. రియాల్టీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ లాభాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్ 6 పాయింట్ల నష్టంతో 39586 దగ్గర, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 11841 దగ్గర ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 107 పాయింట్లు పెరిగి 31269 దగ్గర క్లోజైంది.

టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండియాబుల్స్ హౌసింగ్, ఐషర్ మోటార్స్, ఐషర్ మోటార్స్, ఇన్ఫ్రాటెల్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. టెక్ మహీంద్రా, యూపీఎల్, హెచ్ సి ఎల్ టెక్, రిలయన్స్, హిందాల్కో లూజర్స్‌గా మిగిలాయి.
స్కిప్పర్ లాభాల స్కిప్పింగ్
ప్రముఖ గాల్వనైజ్డ్ పీవీసీ తయారీదారైన స్కిప్పర్ ఈ రోజు మంచి వాల్యూమ్స్‌తో హై జంప్ చేసింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా పన్నెండు రెట్లు పెరిగాయి. చివరకు 7 శాతానికి పైగా లాభాలతో ముగిసింది స్కిప్పర్ స్టాక్.
యాక్సిస్ బ్యాంక్ మరింత జోష్
సంస్థాగత ఇన్వెస్టర్లకు వాటాల అమ్మకం ద్వారా సుమారు రూ.9000 కోట్లు సమీకరించాలని యాక్సిస్ బ్యాంక్ యోచిస్తోందనే వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ స్టాక్ రెండు శాతానికి పైగా లాభపడింది. రూ.802 దగ్గర ముగిసింది.
కాఫీడేపై కోక్ కన్ను
కాఫీడేలో మెజార్టీ వాటా కొనుగోలు చేసేందుకు కోకా కోలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలొచ్చాయి. దేశీయ కాఫీ రిటైల్ మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు కోక్ తీవ్రంగా యోచిస్తోందని, అందుకు కాఫీడే టార్గెట్‌గా ఉన్నట్టు వెల్లడైంది. ఇప్పటికే సుమారు రూ.6500 కోట్ల అప్పుల్లో ఉన్న కాఫీడేకి ఇది కలిసి రావొచ్చు. ఈ వార్తల నేపధ్యంలో కాఫీ డే స్టాక్ మొదట్లో 5 శాతం వరకూ లాభాల్లో కదలాడింది. చివరకు కొద్దిగా లాభాల స్వీకరణ రావడంతో ఆఖరికి 3 శాతం లాభాలకే పరిమితమైంది.
మూడు నెలల తర్వాత ఖుద్రేముఖ్ జోష్యూ
రోప్ మార్కెట్లలో పెల్లెట్స్ అమ్మకానికి సంబంధించి రెండు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది కేంద్రానికి చెందిన ఖుద్రేముఖ్ ఐరన్ ఓర్. దీంతో వరుసగా మూడో సెషన్‌లోనూ స్టాక్ హై జంప్ చేసింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా సుమారు 6 రెట్లు పెరిగాయి. చివరకు స్టాక్ రూ.132 పైన ముగిసింది. పది శాతానికి పైగా స్టాక్ లాభపడింది.
మిడ్ క్యాప్ గెయినర్స్
ఈ సెగ్మంట్లో ఈ రోజు దిలీప్ బిల్డ్ కాన్ 9 శాతం, హెచ్ ఈ జీ 5.5 శాతం, రైల్ వికాస్ నిగం 5.5 శాతం, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 5 శాతం, రైట్స్ 5 శాతం పెరిగాయి. స్మాల్ క్యాప్ స్పేస్‌లో పాలిమెడీ క్యూర్ 8 శాతం, ధనుకా అగ్రిటెక్ 7 శాతం, టిఎన్‌పిఎల్ 6.5 శాతం, త్రివేణీ ఇంజనీరింగ్ 6 శాతం పెరిగాయి.
మిడ్ క్యాప్ లూజర్స్ఈ
వారంలో బాగా ఒడిదుడుకులకు లోనైన పిసి జ్యువెలర్స్, సుజ్లాన్, ఇన్ఫీబీమ్, జైన్ ఇరిగేషన్ వంటి స్టాక్స్‌లో సెల్లింగ్ ప్రెషర్ నమోదైంది. ఐఎఫ్‌సిఐ 10 శాతం, పిసి జ్యువెలర్స్ 7 శాతం, వోకార్డ్ 6 శాతం, సుజ్లాన్ 6 శాతం, కాక్స్ అండ్ కింగ్స్ 10 శాతం, రుషిల్ డెకోర్ 10 శాతం నష్టపోయాయి.
జూలై సిరీస్‌లో ఈ స్టాక్స్ కనిపించవు
వివిధ కారణాలతో ఎఫ్ అండ్ ఓలో ఉండేందుకు అర్హతను కోల్పోయిన 34 స్టాక్స్‌ను తొలగించనుంది ఎన్ఎస్ఈ. జూలై సిరీస్ నుంచి ఇవి ఎఫ్ అండ్ ఓలో కనిపించవు. ఆ జాబితాలో అజంతా ఫార్మా, క్యాన్‌ఫిన్ హోమ్స్, ఇండియా సిమెంట్స్, జెట్ ఎయిర్ వేస్, జైన్ ఇరిగేషన్, కావేరీ సీడ్స్, కర్నాటక బ్యాంక్, పిసి జ్యువెలర్స్, రిలయన్స్ పవర్, సుజ్లాన్ ఎనర్జీ, టాటా కమ్యూనికేషన్స్ వంటి స్టాక్స్ ఉన్నాయి.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications