రీఫండ్ పేరుతో రిలయన్స్ జియో రూ.4,500 కోట్లు చీట్ చేసిందా?
ముంబై: రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ చీట్ చేశారా? అంటే మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత అలాంటి విమర్శలే గుప్పించారు. విజయ్ వాడెట్టివార్... మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత. ఆయన మహా అసెంబ్లీలో మాట్లాడుతూ... తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రిలయన్స్ జియో చీట్ చేసిందని విమర్శలు గుప్పించారు.

రూ.4,500 కోట్ల మేర మోసం చేసిందని ఆరోపణ
రిలయన్స్ జియో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4,500 కోట్ల మేర చీట్ చేసిందని సదరు కాంగ్రెస్ నేత ఆరోపణలు గుప్పించారు. ఈ మొత్తానికి ట్యాక్స్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన నుంచి వసూలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. మంగళవారం నాడు బడ్జెట్ డిస్కషన్ సందర్భంగా ఆయన ఈ ఆరోపణలు గుప్పించారు.

డిపాజిట్ బదులు విక్రయిస్తే...
కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ మాట్లాడుతూ... మూడేళ్ల క్రితం రిలయన్స్ జియో చాలామంది కస్టమర్లకు డిపాజిట్ తీసుకొని హ్యాండ్‌సెట్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ డిపాజిట్‌ను కన్స్యూమర్‌కు మూడేళ్ల తర్వాత తిరిగి ఇస్తామని ప్రకటించిందని చెప్పారు. అయితే ఆ అమౌండ్ మూడేళ్ల తర్వాత రిటర్న్ కాలేదని చెప్పారు. ఒకవేళ వారు డిపాజిట్స్‌కు బదులు హ్యాండ్‌సెట్స్‌ను విక్రయిస్తే ప్రభుత్వానికి 12.5 శాతం వడ్డీని ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుందన్నారు. ఆ మొత్తాన్ని రిలయన్స్ జియో నుంచి వసూలు చేయాలన్నారు.

రీఫండబుల్ పేరుతో...
ఈ అంశానికి సంబంధించి ఓ మీడియా ప్రశ్నించగా.. జియో 3 కోట్ల మంది కస్టమర్లకు హ్యాండ్‌సెట్స్ విక్రయించి, ఒక్కో హ్యాండ్‌సెట్‌కు రూ.1,500 వసూలు చేసిందని, ఇది రీఫండబుల్ అని చెప్పిందని, కానీ ఆ మనీ తిరిగి ఇవ్వలేదన్నారు. మూడో కోట్ల మంది నుంచి రూ.4,500 కోట్లు వసూలు చేసిందని, దానికి 12.5 శాతం జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పారు. కాగా, దీనిని లేవెనత్తిన మహారాష్ట్ర ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్.. బ్రహ్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాధాకృష్ణన్ విఖే పాటిల్ బీజేపీలో చేరడంతో ఆయన స్థానంలో విజయ్ లీడర్ ఆఫ్ ఆపొజిషన్‌గా ఎన్నికయ్యారు.


Click it and Unblock the Notifications