కోకా కోలాకు కాఫీడే పై కన్ను పడింది. ఇండియాలో ఈ మధ్య విపరీతంగా పెరుగుతున్న కాఫీ కల్చర్‌ను, మారుతున్న జనాల శైలిని క్యాష్ చేసుకునేందుకు వీలైతే కాఫీ డేలో మెజార్టీ వాటాను కొనుగోలు చేయాలని చూస్తోంది కోకా కోలా. ఈ మధ్యే యూకెకు చెందిన కోస్టా కాఫీని ఏకంగా రూ.35000 కోట్లకు కొనుగోలు చేసిన కోకా కోలా.. ఈ భారతీయ కాఫీ కంపెనీని టార్గెట్ చేసుకోవడం ఇండియన్ కార్పొరేట్ ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
కోకా కోలాకు ఎలాంటి లాభం ?
కూల్ డ్రింక్స్, బెవరేజెస్ మార్కెట్లో కోలాది తిరుగులేని స్థానం. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే రాబోయే రోజుల్లో మెల్లిగా హెల్త్ కాన్షియస్ అవుతున్నారు. ఎక్కువ షుగర్ బేస్డ్ డ్రింక్స్‌ను తగ్గించుకుంటున్నారు. ఇది ఇప్పటికిప్పుడు జరగకపోయినా కొన్నేళ్ల తర్వాత ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపించవచ్చు. అయితే ఈ లోపు భవిష్యత్ వ్యాపారాలపై దృష్టిసారించాలనే ఉద్దేశంతో కెఫే కాఫీ డే వంటి సంస్థలపై దృష్టిపెట్టింది. ఈ మధ్యకాలంలో కాఫీ తాగే కల్చర్ పెరగడం, యంగ్‌స్టర్స్ కలుసుకునేందుకు ఓ అడ్డాలా ఇవి మారడంతో కాఫీడేకి మంచి ప్రాచుర్యం వచ్చింది. బెంగళూరుకు చెందిన విజి సిద్ధార్థ ఈ సంస్థను స్థాపించారు. ఈ మధ్యే మైండ్ ట్రీ అనే ఐటీ సంస్థలో తన వాటాను ఎల్ అండ్ టికి అమ్మి భారీ మొత్తంలో సొమ్ముచేసుకున్నారు. సంస్థ నెత్తిన ఉన్న రుణాలను కూడా తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో కోక్ ఇండియా సీఈఓ టి క్రిష్ణకుమార్.. డీల్ కోసం పావులు కదుపుతున్నారు.

కాఫీకి అంత మార్కెట్ ఉందా
ప్రస్తుతం దేశీయ కాఫీ రిటైల్ మార్కెట్ విలువ సుమారు రూ.2500 కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనా. అందుకే ఈ రంగంలోనూ తన పట్టు సాధించుకోవాలని చూస్తోంది కోక్. 2025 నాటికి ఈ మార్కెట్ రూ.4500 కోట్లకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కాఫీడేకి 1752 స్టోర్స్, బరిస్టాకు 200 స్టోర్స్, స్టార్‌బక్స్‌కు 146, కోస్టాకు 50 స్టోర్స్ ఉన్నాయి. మొత్తం 2338 బిగ్ ప్లేయర్స్ ఇండియన్ కాఫీ రిటైల్ మార్కెట్లో ఉన్నారు. ఇవి కాకుండా చిన్నాచితకా కాఫీ షాప్స్ కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చాయి. అందుకే ఇలాంటి మార్కెట్లో తన సత్తా చాటాలని చూస్తోంది కోలా. వాస్తవానికి కెఫే కాఫీ డే సంస్థకు కూడా మంచి వేల్యుయేషన్‌లో డీల్ ఓకే అయితే మంచిది. ఎందుకంటే సంస్థ నెత్తిన సుమారు రూ.6500 కోట్ల రుణభారం ఉంది. సంస్థ నెట్వర్త్ కేవలం రూ.2500 కోట్లు మాత్రమే ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో డీల్ కుదుర్చుకోవడానికి కూడా వెనుకాడకపోవచ్చు కాఫీ డే.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications