అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో అత్యంత శ్రీమంతుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. వైయస్ జగన్ సంపద విలువ రూ.510 కోట్లు అని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోని 26 మంత్రుల్లో 23 మంది కోటీశ్వరులు. 83 శాతం మంది కోటీశ్వరులే. వీరి సంపద విలువ సగటున రూ.35.25 కోట్లుగా ఉంది.

ఏపీ కేబినెట్లో అత్యంత ధనవంతుడు జగన్
ఏపీ కేబినెట్లో అత్యంత ధనవంతుడు జగన్ కాగా, ఆయన తర్వాత రెండో స్థానంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ.130 కోట్లు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ ఆస్తుల విలువ రూ.61 కోట్లు. ఈయన మూడో స్థానంలో ఉన్నారు. అప్పుల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అందరికంటే ముందున్నారు. ఆయనకు రూ.20 కోట్లు రుణ భారం ఉంది. చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు రూ.12 కోట్లు, ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాస రావుకు రూ.5 కోట్ల అప్పులు ఉన్నాయి.

2017-18 ఐటీ రిటర్న్స్ ప్రకారం...
2017-18 ఐటీ రిటర్న్స్ ప్రకారం... జగన్ కుటుంబం ఆదాయం రూ.38 కోట్లు, ఇందులో ఆయన సొంత ఆదాయం రూ.25 కోట్లు, ముత్తంశెట్టి శ్రీనివాస రావు కుటుంబ ఆదాయం రూ.3 కోట్లు, అతని సొంత ఆదాయం రూ.1 కోటి, ఆదిమూలపు సురేష్ కుటుంబ ఆదాయం రూ.కోటి, ఇందులో అతని సొంత ఆదాయం రూ.28 లక్షలు.

ఎమ్మెల్యేల్లో చంద్రబాబు తర్వాత జగన్
ఏడీఆర్ అంతకుముందు విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏపీకి చెందిన 174 ఎమ్మెల్యేల్లో 94 శాతం మంది కోటీశ్వరులు. 163 మంది కోటీశ్వరులు ఉన్నట్లు పేర్కొంది. ఇందులో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువమంది ఉన్నారు. ఎమ్మెల్యేల ఆస్తుల విలువ సగటున రూ.27.87 కోట్లుగా ఉంది. స్థిర, చరాస్తులు కలిపి ఆస్తుల్లో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు టాప్‌లో ఉన్నారు. ఆన ఆస్తులు రూ.668 కోట్లు. ఆ తర్వాత జగన్ రూ.510 కోట్లతో ఉన్నారు. వైసీపీ నుంచి 93 శాతం మంది ఎమ్మెల్యేలు, అంటే 140 మంది, టీడీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు అంటే 96 శాతం మంది కోటీశ్వరులు. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ఆస్తి రూ.1 కోటి.

తక్కువ ఆదాయం కలిగిన ఎమ్మెల్యే ధనలక్ష్మి
వైసీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అత్యంత తక్కువ ఆదాయం కలిగిన వారు. ఆమె ఆస్తులు రూ.6.75 లక్షలు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమంటే 2014 నుంచి 2019 మధ్య ఎమ్మెల్యేలుగా పని చేసి మళ్లీ ఎన్నికైన వారు 55 మంది. వారి ఆస్తులు సరాసరిగా రూ.29.97కోట్ల నుంచి రూ.47.99 కోట్లకు పెరిగింది. అంటే అయిదేళ్లలో సదరు వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.18.01 కోట్లు పెరిగాయి. పార్టీలపరంగా చూస్తే టీడీపీ ఎమ్మెల్యేల సరాసరి ఆస్తులు రూ.64.61 కోట్లు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సరాసరి ఆస్తులు రూ.22.41 కోట్లు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications