వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తున్నాయి. ఈ కాలంలో ఎప్పుడు ఎక్కువ వర్షం కురిసి వరదలు ముంచెత్తే అవకాశం ఉందో ఊహించలేము. వరదలు వస్తే మనుషులకే కాకుండా వాహనాలు, ఇళ్లకు వర్షాల వల్ల నష్టం వాటిల్లే అవకాశాలు ఉండవచ్చు. ఇంతకు ముందు వర్షాలు, తుఫాను కారణంగా అనేక రాష్ట్రాల్లో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఇలా నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి పరిహారం లభిస్తే లభించవచ్చు లేకపోతే లేదు. మీకు బీమా రక్షణ ఉంది ఉంటే అంటే బీమా తీసుకుని ఉంటే సరైన పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి బీమాల గురించి తెలుసుకుందాం.

ఆరోగ్య బీమా
ఈ రోజుల్లో అనేక ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. దోమకుడితే చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అనేక వైరల్ జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. నీరు కలుషితం కావడం ద్వారాను వ్యాధులు వస్తున్నాయి. వీటికారణంగా హాస్పిటల్లో చేరితే బిల్లు మోత మోగిపోతుంది. అందుకే ఆరోగ్య బీమా తీసుకుని ఉంటే ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చుల గురించి బాధ పడాల్సిన అవసరం ఉండదు. ఈ రోజుల్లో కనీసం రూ. 5 లక్షల బీమా కవరేజీ తప్పనిసరిగా మారింది. మంచి బీమా కంపనీని ఎంచుకొని ఇంట్లోని సభ్యులందరికీ ఆరోగ్య బీమాను తీసుకుంటే ధీమాగా ఉండవచ్చు. 35 సంవత్సరాల లోపు వయసు ఉంది ఇద్దరు పిల్లలు ఉంటే రూ. 15 వేల లోపు ప్రీమియంతో రూ. 5 లక్షల కవరేజికి బీమాను తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్లో చేరితే ఎంత ఖర్చు అవుతుందో ఊహించలేదు. కాబట్టి కాస్త ఆర్థికంగా భారమైనా ఆరోగ్య బీమాను తీసుకోవడం మంచిది.

వాహన బీమా
ఈ రోజుల్లో వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. దీనికి బీమా ప్రీమియం తక్కువగా ఉంటుంది. బీమా ప్రయోజనం కూడా తక్కువే ఉంటుంది మరి. అందుకే సమగ్ర బీమాను తీసుకోవడం వల్ల వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తగిన పరిహారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో వాహనాల్లోనికి నీళ్లు చేరే అవకాశం ఉంటుంది. అప్పుడు వాహనమే కాకుండా ఇంజన్ కూడా పాడవడానికి అవకాశం ఉండవచ్చు. వరదల వల్ల వాహనాలు కొట్టుకుపోవచ్చు. లేదా వాటికి నష్టం వాటిల్ల వచ్చు. కాబట్టి వాహనం బీమా తీసుకోవడం వల్ల వర్షాకాలంలో తగిన రక్షణను పొందవచ్చు.

గృహ బీమా
ఇంటికి బీమా తీసుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. తమ ఇంటికి ఏమీ కాదన్న భరోసానే ఇందుకు కారణం. కానీ దురదృష్టవశాత్తు ఏమైనా, ఎప్పుడైనా జరగవచ్చు. ఇళ్లకు అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. వర్షాలవల్ల వచ్చిన వరదలతో ఇల్లు కొట్టుకు పోవడం లేదా కూలిపోవడం జరిగిన ఉదంతాలు ఉన్నాయి. పిడుగు పాటుకు కూడా గృహాలకు నష్టం జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా గృహ బీమాను తీసుకోవడం మంచిది.

వ్యక్తిగత ప్రమాద బీమా
ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో ఊహించలేము. రహదారిపై మనం సక్రమంగానే వెళుతున్న ఎదుటివారు అంతే సక్రమంగా, బాధ్యతగా రావాలన్న దేమీలేదు. అలాంటప్పుడు మీకు ప్రమాదం జరిగి నష్టం కలిగే అవకాశం ఉండవచ్చు. వర్షాకాలంలో వాహనంపై వెళుతున్నప్పుడు రోడ్డుపై ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టం. వాటిలో పడిపోయి ప్రమాదానికి గురైనప్పుడు మీరు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకుని ఉంటే మీకు బీమా రక్షణ లభిస్తుంది. ప్రమాదం వల్ల శాశ్వత అంగవైకల్యం సంభవించవచ్చు. లేదా తాత్కాలిక అంగవైకల్యం రావచ్చు. మరణం కూడా సంభవించ వచ్చు. ఇలాంటి సమయంలో మీకు లేదా మీ కుటుంబానికి బీమా రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications