న్యూఢిల్లీ: జూలై 5వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ పైన అందరికి ఆసక్తి ఉంది. ఆయా రంగాలు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నాయి. అలాగే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హోమ్ బయ్యర్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, కొనుగోలుదారులు కూడా ఆశలు పెట్టుకుంటారు. హోమ్ బయ్యర్స్.. ఫోరమ్ ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ (FPCE) ఈ మేరకు పలు విజ్ఞప్తులు చేసింది. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో లక్షలాదిమంది సొమ్ము చిక్కుకుపోయింది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఈ అంశంపై ఊరట కల్పించాలని FPCE విజ్ఞప్తి చేసింది.

హోమ్ బయ్యర్స్ ఏం కోరుకుంటున్నారు..
నిలిచిపోయిన ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు నిధిని ఏర్పాటు చేయాలని FPCE కోరుకుంటోంది. దేశంలో 5 లక్షలమందికి పైగా హోమ్ బయ్యర్స్ సంపాదన వివిధ ప్రాజెక్టుల్లో నిలిచిపోయిందని, ఈ ప్రాజెక్టుల డెవలపర్స్ బ్యాంక్రఫ్ట్ లేదా నిధుల్ని దారి మళ్లించడం లేదా అనుమతులు రాకపోవడం వంటి కారణాలతో ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయని, ఇవి ముందుకు సాగడానికి ప్రభుత్వం రూ.10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయాలని కోరింది.

అయిదేళ్ల కాలపరిమితిలో పూర్తయ్యేలా...
రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాజెక్టులు ఆలస్యం ఈ రంగానికి శాపం వంటిదని చెబుతున్నారు. కాబట్టి నిలిచిపోయిన ప్రాజెక్టుల కోసం ఫండ్ ఏర్పాటు చేసి, అయిదేళ్ల కాలపరిమితిలో పూర్తయ్యేలా చూడాలని కోరుకుంటున్నారు. ఇలా చేస్తే ఈ రంగం వేగంగా ముందుకు వెళ్తుందని, ఈ సెక్టార్ పైన తిరిగి విశ్వాసం ఏర్పడుతుందని, కఠిన రెరా అమలుతో మళ్లీ ఇలా జాప్యం జరగకుండా ఉంటుందని ఆశిస్తున్నారు.

డిస్ట్రెస్ ఫండ్‌తో..
ప్రాజెక్టులు ముందుకు సాగేందుకు డిస్ట్రెస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు హోమ్ బయ్యర్స్‌ను ప్రైమరీ సెక్యూర్డ్ క్రెడిటర్స్‌గా కేటగరైజ్ చేయాలని కోరుకుంటోంది. కేంద్రం ఈ దిశగా బిల్లు తీసుకు రావాలని కోరుతోంది. కాగా, అనరాక్ డేటా ప్రకారం టాప్ 7 సిటీల్లో రూ.4,51,750 కోట్ల విలువైన నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. ముఖ్యమంగా ఎంఎంఆర్ (Mumbai Metropolitan Region), ఎన్‌సీఆర్‌లోనే ఎక్కువమంది ఉన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications