స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజూ లాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లలో ఊరట నింపింది. అయితే రేపు జూన్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ఉన్న నేపధ్యంలో మార్కెట్లు మరింత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి. నిన్న మాదిరే ఈ రోజు కూడా మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు లభించింది. 11768 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ 11871 పాయింట్ల గరిష్ట స్థాయి వరకూ వెళ్లింది. అంటే 100 పాయింట్లకు పైగా జంప్ ఈ రోజు మార్కెట్లలో నమోదైంది. అయితే చివర్లో కాస్త తడబడినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో 39592 దగ్గర, 51 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11847 దగ్గర క్లోజయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 315 పాయింట్లు పెరిగి 31162 దగ్గర క్లోజైంది.
వేదాంతా, పవర్ గ్రిడ్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, సన్ ఫార్మా, హిందాల్కో టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. బ్రిటానియా, ఇండియాబుల్స్ హౌసింగ్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎయిర్టెల్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

అనిల్ స్టాక్స్ ఎన్నాకెన్నాళ్లకు
అనిల్ ధీరూభాయ్ అంబానీ స్టాక్స్ మళ్లీ చాలా కాలం తర్వాత లాభాల్లోకి రావడం చూస్తున్నాం. రిలయన్స్ ఇన్ఫ్రా ఓ భారీ ప్రాజెక్టును దక్కించుకోవడం ఒక్కటే పాజిటివ్ పాయింట్. అయితే మిగిలిన గ్రూప్ స్టాక్స్ అన్నీ ఈ రోజు ఎగిరి గంతేశాయి.
రిలయన్స్ ఇన్ఫ్రా 17 శాతం, రిలయన్స్ పవర్ 11 శాతం, రిలయన్స్ హోం ఫైనాన్స్ 10 ళాకంస రిలయన్స్ క్యాపిటల్ 10 శాతం పెరిగాయి.
ఎస్బీఐ లైఫ్‌కు పాజిటివ్ కిక్
నిన్న ఓఎఫ్ఎస్ కారణంగా నష్టపోయిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్‌కు మంచి మద్దతు లభిస్తోంది. రాబోయే రెండు,మూడేళ్లలో ఇన్సూరెన్స్ థీమ్ మెరుగైన పనితీరును కనబర్చవచ్చు అనే అంచనాలో ఈ స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి. ఈ రోజు ఎస్బీఐ లైఫ్ 7 శాతం పెరిగింది. చివరకు రూ.716 దగ్గర క్లోజైంది.
డిఫాల్ట్ అయినా సరే..
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ సుమారు రూ.225 కోట్ల విలువైన కమర్షియల్ పేపర్ల విషయంలో డిఫాల్ట్ అయింది. నిన్న రూ.375 కోట్ల విలువైన బాండ్లకు ఆఖరు తేదీ అయిన నేపధ్యంలో కేవలం రూ.150 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగిలిన వాటిని చెల్లించేందుకు మరికొద్ది గడువు కోరింది. వరుసగా ఒకే నెలలో రెండుసార్లు డిఫాల్ట్ కావడం మార్కెట్ వర్గాలను ఆందోళనలోకి నెట్టింది. అయితే స్టాక్ మాత్రం అనూహ్యంగా 6 శాతం లాభపడి రూ.79.75 దగ్గర క్లోజైంది. ఇంట్రాడేలో రూ.68.60 కనిష్టానికి పడిన స్టాక్ మిడ్ సెషన్‌కే కోలుకుంది.
పీఎస్‌యూ బ్యాంకుల్లో యమా జోరు
మిడ్ సెషన్ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అనూహ్యమైన జోరు నమోదైంది. అలహాబాద్ బ్యాంక్ 12 శాతం, సిండికెట్ బ్యాంక్ 8 శాతం, ఓరియంట్ బ్యాంక్ 5 శాతం పెరిగాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లో సెంట్రల్ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లోనే ముగిశాయి. కేంద్రం నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ రావొచ్చని మార్కెట్ వర్గాలు ముందే ఊహిస్తున్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications