నిర్మాణ రంగాన్ని.. ప్రధానంగా గృహ నిర్మాణ రంగాన్ని పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాల్లో ఉంది. రాబోయే బడ్జెట్లో దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్న కేంద్రం.. ఎన్నో తాయిలాలను ఇవ్వాలని చూస్తోంది. అవసరమైతే కొత్త ఇంటిని కొనుగోలు చేసే వాళ్లకు పన్ను ప్రోత్సాహకాలను ఇవ్వడంతో పాటు రెండో ఇంటిని తీసుకునే వారికీ బెనిఫిట్ ఇవ్వాలని చూస్తున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

కష్టాల్లో రియల్ ఎస్టేట్
హైదరాబాద్ వంటి కొన్ని ప్రాంతాలు మినహా దేశంలో అత్యధిక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ భారీగా నష్టపోయింది. నిర్మాణ రంగం అంతంతమాత్రమైన పనితీరును కనబరుస్తోంది. అందుకే మిగిలిపోయి ఇన్వెంటరీ నెలనెలా పెరిగిపోతోంది. దీని వల్ల బిల్డర్లతో పాటు బ్యాంకర్లు కూడా ఇబ్బందిపడ్తున్నారు. అందుకే ఎలాగైనా ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించాలని పరిశ్రమ చాలా కాలం నుంచి వేడుకొంటోంది. గత బడ్జెట్లో ఇందుకు అవకాశం లేకపోవడంతో ఈ సారి తాయిలాలు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.

ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవివే
గృహ నిర్మాణ రంగానికి ఊపు తీసుకురావాలంటే మొదటగా చేయాల్సింది మధ్యతరగతి వాళ్లను తాయిలాలతో ఆకట్టుకోవడమే. అందుకే అధిక ట్యాక్స్ రాయితీలు ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశిలీస్తోంది. జూలై 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇందుకు సంబంధించిన ప్రకటన ఉండొచ్చని యోచిస్తున్నారు. 2014 బడ్జెట్లో మోడీ సర్కార్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీపై (నివాసం ఉంటున్న సొంత ఇల్లు) వడ్డీ రాయితీని రూ.లక్షన్నర నుంచి రెండు లక్షలకు పెంచారు. దీనివల్ల 30 శాతం గరిష్ట శ్లాబులో ఉన్న ట్యాక్స్ పేయర్ రూ.15 వేల వరకూ పన్ను ఆదా పొందుతున్నాడు.

ఇల్లు నిర్మాణంలో ఉంటే పన్నులో పూర్తి రాయితీ
ఇప్పుడున్న సమస్య ఏంటంటే.. మనం ఏదైనా ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత అది వెంటనే మన చేతికి రాదు. ఒక వైపు ఈఎంఐ కడ్తూనే.. మరోవైపు అద్దె ఇంట్లో కొన్ని నెలల పాటు ఉండాలి. ఒక వేళ బిల్డర్ చెప్పిన సమయం కంటే ఆలస్యం చేస్తే.. రెండు వైపులా మనం భారాన్ని మోయాల్సి ఉంటుంది. అందుకే ఈ బడ్జెట్లో ఆ సమస్యకు కొద్దిగా పరిష్కారం చూపాలని చూస్తున్నారు. ఒక వేళ సదరు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంటే మొత్తం వడ్డీని తగ్గించాలని డిడక్షన్ కింద పరిగణించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీని వల్ల పన్ను భారం కొద్దిగా తగ్గే అవకాశాలున్నాయి.

రెండో ఇంటికి ?
గతంలో ఏ పన్ను చెల్లింపుదారుడైనా రెండో ఇంటిని రుణంతో కొనుగోలు చేసినప్పుడు దానిపై చెల్లించే వడ్డీని మాత్రం క్లెయిం కింద చూపించుకునే వాళ్లు. సదరు వడ్డీపై ఎలాంటి పరిమితి ఉండేదికాదు. ఒక వేళ చెల్లించే వడ్డీ కంటే.. సదరు ఇంటిపై వచ్చే అద్దె ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని ఇతర అదర్ ఇన్‌కం పద్దు కింద నష్టంగా చూపించుకునే వీలుండేది. అయితే గతసారి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండో ఇంటిపై వడ్డీ డిడక్షన్ పరిమితి రూ.2 లక్షలకు పరిమితం చేశారు. ఈ నష్టాన్ని ఎనిమిదేళ్లపాటు క్యారీఫార్వర్డ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
అయితే అద్దెల వస్తున్న ఆదాయం తగ్గుతున్న నేపధ్యంలో నష్టాన్ని పూడ్చుకోవడం కష్టంగా ఉందనేది కేంద్రానికి అందిన నివేదిక.
అందుకే రెండో ఇంటికి సంబంధించి గతంలో ఉన్న అపరిమిత వడ్డీ డిడక్షన్ వైపే మొగ్గాలని కేంద్రం చూస్తోంది. దీని వల్ల రెండో ఇంటిని కొనుగోలు చేసే వారికి ప్రయోజనం కలుగనుంది.
అదే సమయంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమకు కూడా పాత ఇన్వెంటరీని త్వరగా అమ్ముకునేందుకు లైన్ క్లియర్ అయినట్టువుతుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications