బిట్ కాయిన్.. కొన్నేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన క్రిప్టో కరెన్సీ. అయితే ఆ తర్వాత వివిధ దేశాలు వీటిని తిరస్కరించడం, వివిధ ప్రముఖ జాతీయ బ్యాంకులు అనేక ఆంక్షలు విధించడంతో బిట్ కాయిన్ మెల్లిగా చరిత్రలో కలిసిపోతుందని అనుకున్నారు. అప్పట్లో ఒక్కో బిట్ కాయిన్ సుమారు 19 వేల డాలర్లు పలికింది. అంటే మన కరెన్సీతో చూస్తే సుమారు రూ.13 లక్షలు. కానీ ఆ తర్వాత 3500 డాలర్ల వరకూ పడిపోయింది. ఇక దీని పనైపోయిందని, ఇక బిట్ కాయిన్ చరిత్రే అనుకున్న వాళ్లకు గట్టి సమాధానమిస్తూ.. ఫినిక్స్ పక్షిలా లేచింది. మళ్లీ 13 వేల డాలర్ల దిశగా దూసుకుపోతోంది.

ఫేస్ బుక్ ఎఫెక్ట్
ఇప్పటి వరకూ బిట్ కాయిన్, ఎథీరియం వంటి అనేక క్రిప్టో కరెన్సీలు వచ్చినా వాటిని యావత్ ప్రపంచం నమ్మలేదు. ఎందుకంటే టెక్నాలజీతో ముడిపడిన ఈ కరెన్సీని సొంతం చేసుకోవడానికి భయపడ్డారు. అయితే తాజాగా ఫేస్ బుక్... లిబ్రా పేరుతో సొంత డిజిటల్ కరెన్సీని లాంఛ్ చేయడం బిట్ కాయిన్‌కు బలాన్నిచ్చింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఏకంగా 216 శాతం పెరిగింది ఈ కరెన్సీ. జనవరి ఒకటో తేదీన 3843 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు ఏకంగా 12300 డాలర్ల స్థాయికి చేరింది. ఎప్పుడెప్పుడు 20 వేల డాలర్లకు చేరాలా అనే ఉత్సాహంతో పైపైకి దూకుతోంది.

బిట్‌కాయిన్ ఉంటే జైలుకే
కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకువచ్చిన డిజిటల్ కరెన్సీ బిల్ 2019 డ్రాఫ్ట్ ప్రకారం ఎవరైనా క్రిప్టో కరెన్సీని మైనింగ్ చేసినా, జనరేట్ చేసినా, అమ్మినా - కొనుగోలు చేసినా పదేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. వీటికి తోడు ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కూడా కేసులు నమోదు చేసే వెసులుబాటు చట్టబద్ధ సంస్థలకు ఉంది. అందుకే ఒక వేళ వివిధ మార్గాల్లో మనం కొనుగోలు చేస్తే.. ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే కొన్ని సంస్థలు సింగపూర్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. వాటిల్లో భారతీయులు చాలా వరకూ పెట్టుబడులు పెడ్తున్నారు. వీటిల్లో కొన్ని సంస్థలను నమ్మొచ్చు కానీ..తెలిసీ తెలియకుండా పెట్టుబడులు పెడితే.. ఉన్నది మొత్తం ఊడ్చి వాళ్లకు పెట్టినట్టే లెక్క. అందుకే వీటిల్లో పెట్టుబడి పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి.

లిబ్రా వస్తే దశ తిరుగుతుందా
ఫేస్ బుక్ వంటి అతిపెద్ద సంస్థ నుంచి వస్తోంది కాబట్టి లిబ్రా ఆర్గనైజ్డ్‌గానే ఉంటుంది. అందుకే వీసా, మాస్టర్ కార్డ్, పే పాల్ వంటి సంస్థల కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. వివిధ కంపెనీలు కూడా సదరు లిబ్రాను అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో బిట్ కాయిన్ వంటి ఇతర క్రిప్టోలకు ఫ్యూచర్ ఉండొచ్చని భావిస్తున్నారు. మరి 20 వేల డాలర్లకు బిట్ కాయిన్ వెళ్తుందా అంటే మాత్రం చెప్పడం కష్టం. ఇప్పుడు ఒక్కో బిట్ కాయిన్ కొనాలంటే రూ.8.65 లక్షలు కావాలి. ఒకప్పుడు రూ.13లక్షలు పెడితే తప్ప బిట్‌కాయిన్ దొరికేది కాదు. ఎప్పుడు ఎందుకు ఎలా పెరుగుతుందో, ఎందుకు పడిపోతుందో చెప్పలేని పరిస్థితులున్నాయి కాబట్టి రిస్క్ కూడా అలానే ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications