వాషింగ్టన్: యాపిల్ ఆపరేటింగ్ సిస్టం ఐవోఎస్‌కు ప్రధాన పోటీగా మొబైల్ ఆపరేటింగ్ సిస్టంను ఆవిష్కరించలేకపోవడమే మైక్రోసాఫ్ట్ చీఫ్‌గా తన అతిపెద్ద తప్పిదమని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ అన్నారు. మొబైల్ ఫోన్ మార్కెట్‌ను ఆండ్రాయిడ్‌కు కోల్పోవడం తాము చేసిన తప్పిదాల్లో అతి పెద్దది అన్నారు. విలేజ్ గ్లోబల్ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొబైల్ ఫోన్ల ప్రస్తావన వచ్చింది. ఈ సమయంలో ఆయన మాట్లాడారు. ఓఎస్ విషయంలో విజేతలో మార్కెట్ మొత్తాన్ని ఆక్రమిస్తారన్నారు.

స్మార్ట్ ఫోన్ విప్లవాన్ని ఊహించినా...
ప్రస్తుతం యాపిల్‌కు పోటీగా ఆండ్రాయిడ్ ఒక్కటే ప్రామాణిక ఫోన్ ప్లాట్‌ఫాంగా ఉందని, ఆ స్థానాన్ని మైక్రోసాఫ్ట్ గెలుచుకొని ఉండవచ్చునని, కానీ అప్పుడు నాన్ యాపిల్ ఆపరేటింగ్ సిస్టంగా వెలుగొందడానికి ఒకే ఆపరేటింగ్ సిస్టంకు అవకాశం ఉందని, ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఉంటే ఫోన్ల విషయంలో తాము ఆధిపత్యంలో ఉండేవారమని బిల్ గేట్స్ అన్నారు. స్మార్ట్ ఫోన్ విప్లవాన్ని ముందే ఊహించి అందుకు తగిన విధంగా ప్రతిస్పందించకపోవడం తన తప్పేనని చెప్పారు.

ఆండ్రాయిడ్ అవసరాన్ని క్యాష్ చేసుకోలేదు
అలాగే, ఐవోఎస్‌కు పోటీగా వచ్చిన ఆండ్రాయిడ్ ఓఎస్‌ను గూగుల్‌కు మైక్రోసాఫ్ట్ ఎలా కోల్పోయిందో చెప్పారు బిల్ గేట్స్. సాఫ్టువేర్ రంగంలో ఆపరేటింగ్ సిస్టం (OS) వల్లే మార్కట్లో విజయం సాధిస్తామని, కంప్యూటర్ల విషయంలో ఇందులో విజయం సాధించామని, కానీ స్మార్ట్ ఫోన్ విషయంలో సాధ్యం కాలేదన్నారు. ఇక, ఐవోఎస్ కేవలం ఐ ఫోన్లకే పరిమితం. ఇతర ఫోన్లకు ఓఎస్ అవకాశం ఉండటంతో ఆండ్రాయిడ్ స్థిరపడిందని చెప్పారు. నాన్-యాపిల్ ఫోన్ ప్లాట్‌ఫాంలకు ఆండ్రాయిడ్ అవసరమని, శూన్యత ఉన్న సమయంలో దానిని క్యాష్ చేసుకోలేకపోయినట్లు అభిప్రాయపడ్డారు.

ఇవీ కారణాలు
ఆపిల్ తన ఐఫోన్‌ను 2007లో తీసుకు వచ్చింది. గూగుల్ తన ఆండ్రాయిడ్‌ను 2008లో తీసకు వచ్చింది. అంతకుముందు 2000 సంవత్సరంలోనే మైక్రోసాఫ్ట్ ఓఎస్ విండోస్ మొబైల్‌ను తీసుకు వచ్చింది. అయితే ఐవోఎస్, ఆండ్రాయిడ్ కంటే మైక్రోసాఫ్ట్ ముందే తెచ్చిన ఓఎస్ విండోస్ వెనుకబడింది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అప్పుడు యూఎస్ డిపార్టుమెంట్ ఫిర్యాదు నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ యాంటీ ట్రస్ట్ విచారణ ఎదుర్కోవడం, మొబైల్ మార్కెట్ పైన దృష్టి పెట్టలేకపోవడం వంటి కారణాలున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications