జగన్‌కు బీజేపీ ఝలక్: ఆర్థిక సంక్షోభంలోకి ఆంధ్రప్రదేశ్....!!

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని, కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్! గత ఎన్నికల్లో బీజేపీకి ఏకంగా 303 సీట్లు రావడం వల్ల కేంద్రంపై కచ్చితంగా హోదా వచ్చేలా ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడిందని జగన్ ఇదివరకే చెప్పారు. అయినప్పటికీ హోదా కోసం కృషి చేస్తామన్నారు. హోదా కోసం ప్రభుత్వం కృషి చేస్తే తాము మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెప్పారు. కానీ కేంద్రం నాలుగేళ్లుగా చెప్పిన మాటనే మరోసారి చెప్పింది. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయని, దాంతో పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని వైసీపీ, టీడీపీ చెబుతున్నాయి. కానీ హోదాకు పరిశ్రమల రాయితీకి సంబంధం లేదని బీజేపీ చెబుతోంది.

7 రాష్ట్రాల నుంచి హోదా డిమాండ్

7 రాష్ట్రాల నుంచి హోదా డిమాండ్

ప్రత్యేక హోదా ప్రతిపాదన ఏదీ లేదని, పరిశ్రమల రాయితీలకు హోదాతో సంబంధం లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో సోమవారం స్పష్టం చేశారు. హోదా కోసం ఇప్పటి వరకు ఏపీతో పాటు ఒడిశా, రాజస్థాన్, బీహార్‌, తెలంగాణ, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతులు వచ్చాయని చెప్పారు. పరిశ్రమల రాయితీల కోసం ప్రత్యేక హోదా వంటి ప్రత్యేక చర్యలు అవసరం లేదన్నారు. బీహార్‌కు చెందిన జేడీయూ సభ్యులు కౌశలేంద్ర కుమార్‌ అడిగిన రాతపూర్వక ప్రశ్నకు సోమవారం లోకసభలో ఆమె సమాధానం చెప్పారు.

అందుకే ప్రత్యేక హోదా

అందుకే ప్రత్యేక హోదా

భౌగోళిక పరిస్థితులు, ఆర్థికంగా నిలబడే శక్తి లేకపోవడం వంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న రాష్ట్రాలకే గతంలో జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక హోదాను ప్రకటించిందన్నారు. కొండ ప్రాంతాలు, తక్కువ జన సాంధ్రత, ఎక్కువ గిరిజన జనాభా, పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలు, ఆర్థిక, మౌలిక సదుపాయాల వెనుకబాటు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. అందులో పరిశ్రమల రాయితీల కోసం ఎలాంటి ప్రత్యేక చర్యలు లేవన్నారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో లేదన్నారు.

ఆర్థిక సంక్షోభంలోకి ఏపీ!

ఆర్థిక సంక్షోభంలోకి ఏపీ!

ఇదిలా ఉండగా, 2014లో ఏపీ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి రూ.90 వేల కోట్ల అప్పులు ఉంటే అయిదేళ్లలో అవి రూ.2.68 లక్షల కోట్లకు చేరాయని, వాటిపై ఏటా రూ.20వేల కోట్లు వడ్డీ అవుతోందని వైసీపీ లోకసభా పక్ష నేత మిథున్ రెడ్డి అన్నారు. ఓ వైపు అప్పులు పెరుగుతుంటే కేంద్రం సాయం అందకుంటే ఏపీ ఆర్థిక సంక్షోభంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత జీతాలు చెల్లించలేని దుస్థితి వస్తుందన్నారు. కాబట్టి హోదా ఇవ్వాలన్నారు. అయితే బీజేపీ హోదా ముగిసిన అధ్యాయం అని పదేపదే చెబుతోంది.

పోలవరం అంచనాలకు ఆమోదం

పోలవరం అంచనాలకు ఆమోదం

2017-18 రేటు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.55,548.87 కోట్లకు కేంద్ర జల శక్తి శాఖ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి జూన్ 2021ని లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టు కోసం రూ.6764.16 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. వ్యయంపై ఆడిట్ నివేదిక, 2013-14 లెక్కల ప్రకారం సవరించిన అంచనా వ్యయం పంపితే మిగతా నిధులు విడుదల చేస్తామని రెండుసార్లు ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు చెప్పింది. ప్రాజెక్టు పనులు జీఎస్టీ పరిధిలోకి వస్తాయని, మినహాయింపు నిమిత్తం ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని పేర్కొంది.

పోలవరం సవరించిన అంచనాల ప్రకారం...

పోలవరం సవరించిన అంచనాల ప్రకారం...

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం... నీటి సరఫరాకు అయ్యే ఖర్చు రూ.50,987 కోట్లు, కుడి ప్రధాన కాలువకు రూ.4,318 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ.4,202 కోట్లు, హెడ్ వర్క్స్‌కు రూ.9,734 కోట్లు, భూసేకరణ, పునరావసం కోసం రూ.33,168 కోట్లు, విద్యుత్ ప్రాజెక్టు వ్యయం రూ.4,560 కోట్లు. మరోవైపు, భూసేకరణ పనులు పూర్తి కానందున విజయవాడ - అమరావతి రింగ్ రోడ్డు ప్రాజెక్టు ప్రారంభం కాలేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+