న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్‌లలో ఒకరైన విరల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం మరో ఆరు నెలలు ఉంది. అయినప్పటికీ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన జనవరి 23, 2017న ఆర్బీఐలో చేరారు. ఆర్థిక సరళీకరణ విధానాల అమలు అనంతరం ఆర్బీఐలో చేరిన డిప్యూటీ గవర్నర్లలో అతి పిన్న వయస్కుడు.
ఈ నెల ఆరంభంలో జరిగిన పరపతి సమీక్ష సమావేశానికి కొన్ని రోజుల ముందే ఆయన తన రాజీనామాను సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఆయ గతంలో న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పని చేశారు. రాజీనామా అనంతరం ఇప్పుడు తిరిగి అక్కడికే అర్థశాస్త్రం ప్రొఫెసర్‌గా వెళ్లనున్నారు.

ఊర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఆచార్య ఆర్బీఐలో అసౌకర్యంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గత రెండు మానిటరీ పాలసీల్లో గవర్నర్ నిర్ణయాలతో ఆచార్య విబేధించినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి మానిటరీ పాలసీలో ఆర్థిక లోటు స్థితి, దానిని లెక్కింపు అంశంపై గవర్నర్ శక్తికాంత దాస్‌తో ఆచార్య విబేధించారని తెలుస్తోంది.
ప్రభుత్వ రంగ సంస్థల రుణాలు ప్రభుత్వ ఆర్థిక లోటు కింద లెక్కించడం సరికాదని శక్తికాంత దాస్ చెప్పగా, రుణాలు పీఎస్‌యూల ఓవరాల్ డెఫిసిట్‌కు సంబంధించిన అంశమని ఆచార్య చెప్పారని తెలుస్తోంది. కాగా, వచ్చే నెలలో రిటైర్ కానున్న సీనియర్ డిప్యూటీ గవర్నర్ ఎన్ విశ్వనాథన్‌ను మరికొన్నాళ్లు కొనసాగించే అవకాశముందని తెలుస్తోంది.
ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆర్బీఐకి స్వతంత్రత ఉండాల్సిందేనని విరాల్ ఆచార్య భావించారు. ఆర్బీఐ నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications