For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్బీఐ వద్ద మిగులు నిధుల ఇష్యూ, నాలుగోసారి ప్యానల్ వాయిదా

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి మిగులు నిధులను అప్పగించే విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదు. ఈ అంశంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులను నియమించారు. ఇది ఏప్రిల్ నెలలో తన నివేదికను సమర్పించవలసి ఉంది. అయితే ఏకాభ్రియం రాని కారణంగా రిపోర్ట్ ఆలస్యమవుతోంది. ఇలా నివేదికలో జాప్యం కావడం ఇది నాలుగోసారి.

గుడ్‌న్యూస్: రూ.3లక్షల లోపు ఆదాయం ఉంటే నగరంలో అద్దె ఇళ్లుగుడ్‌న్యూస్: రూ.3లక్షల లోపు ఆదాయం ఉంటే నగరంలో అద్దె ఇళ్లు

కేంద్ర బడ్జెట్ ముగిసిన అనంతరం జూలైలో ఈ కమిటీ నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం రూ.9 లక్షల కోట్ల నిధుల్లో రూ.3 లక్షల కోట్లను తమకు బదలాయించుకోవాలని కేంద్రం పట్టుదలగా ఉంది. దీనికి ఉర్జీత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో అంగీకారం తెలపలేదు. దీంతో ఆర్బీఐ వద్ద ఎంత మిగులు నిధులు ఉండాలనే అంశం తేల్చేందుకు బిమన్ జలాన్ నేతృత్వంలో కమిటీని వేశారు.

RBI panel defers reserves report for fourth time

ఈ కమిటీలో రాకేష్ మోహన్ వైస్ ఛైర్మన్‌గా, సుభాష్ చంద్రగార్గ్ , ఎస్‌ఎస్ విశ్వనాథన్, భారత్‌ దోషి, సుధీర్‌ మ్యాంకడ్ ఉన్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంది. కానీ ఆ తర్వాత జూన్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు దాన్ని జులైకు వాయిదా పడింది.

English summary

ఆర్బీఐ వద్ద మిగులు నిధుల ఇష్యూ, నాలుగోసారి ప్యానల్ వాయిదా | RBI panel defers reserves report for fourth time

A Reserve Bank of India panel deciding on guidelines for transfer of the central bank's surplus funds to the government has further delayed submitting its report, an official said on Monday.
Story first published: Monday, June 24, 2019, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X