ఫ్లిప్ కార్ట్.. దేశ అతిపెద్ద ఈకామర్స్ దిగ్గజం. పన్నెండేళ్ల క్రితం భారత్‌లో ఓ కొత్త ఒరవడికి నాంది పలికి అప్పటి నుంచి ఎన్నో వందలాది స్టార్టప్స్‌కు రోల్ మోడల్‌గా నిలిచింది ఈ సంస్థ. పుస్తకాల అమ్మకంతో మొదలైన వీళ్ల ప్రస్థానం ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాల్‌మార్ట్ పెట్టుబడితో మరింతగా ఫోకస్ అయిన ఫ్లిప్ కార్ట్.. ఇప్పుడు అమెరికన్ మార్కెట్లో ఐపీఓకు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. రాబోయే మూడేళ్లలో ఇందుకోసం ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంది.
ప్లాన్ రెడీ
ఐపీఓకు వచ్చి ప్రజల నుంచి నిధుల సమీకరించేందుకు సిద్ధం కావాలంటూ ఫ్లిప్ కార్డ్ బోర్డ్ కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ నెల మొదట్లో బెంటాన్‌విల్లేలో ఏర్పాటైన ఫ్లిప్ కార్ట్ మీటింగ్‌లో సంస్థ సీఈఓ క్రిష్ణమూర్తి ఇందుకు సంబంధించిన సంకేతాలను ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. వాల్ మార్ట్ షేర్ హోల్డర్ల వార్షిక సమావేశంలో భాగంగా ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడి నుంచి కఠినమైన విధానాలను పాటించడంతో పాటు లాభాలను పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేసి ఐపీఓకు వెళ్లాల్సి ఉందనే సంకేతాన్ని క్రిష్ణమూర్తి.. ఇతర బోర్డు సభ్యులకు చెప్పినట్టు సమాచారం.

ఇన్వెస్టర్లకు డబ్బులే డబ్బులు
అన్నీ అనుకున్నట్టు సాగి యూఎస్‌లో ఫ్లిప్ కార్ట్ లిస్ట్ అయితే ఫ్లిప్ కార్ట్ ఫౌండర్లకు, వాల్ మార్ట్‌కు మంచి నిధులే వస్తాయి. ఎందుకంటే ప్రస్తుతానికి ఫ్లిప్ కార్ట్‌లో 77 శాతం వాటా భారతీయ కంపెనీకే ఉంది. ఐపీఓ నుంచి సమీకరించిన సొమ్ముతో సదరు భారతయీ కంపెనీ ప్రమోటర్లను ఎగ్జిట్ చేస్తామని వాల్ మార్ట్ భావిస్తోంది. అయితే వేల్యుయేషన్ కోసం ఇక లాభార్జనపై దృష్టిపెట్టబోతున్నారు. వాల్ మార్ట్ గత క్వార్టర్లో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో లాభాలు కరిగిపోవడానికి ఫ్లిప్ కార్ట్ కారణమైంది. ఎందుకంటే ఫ్లిప్ కార్ట్‌ను తమ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ రిపోర్టులో మిళితం చేశారు. ఇంతకాలం ఫ్లిప్ కార్ట్ ఆదాయాన్ని ఆర్జిస్తోంది కానీ లాభాల్లో మాత్రం లేదు. అందుకే ఇక ఆ నష్టాల పరంపర నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలని చూస్తున్నారు.
ఐపీఓకి రెడీ చేయండి
భారత్‌లో సెబీ రూల్స్ ప్రకారం ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్లో ఐపీఓకు రావాలంటే కనీసం మూడేళ్ల పాటు లాభాలను ఆర్జించి ఉండాలి. యూఎస్‌లో అయినా నిబంధనలు కొద్దిగా మార్పు ఉండొచ్చు. ఎవరైనా ఓ స్టాక్ కొనాలంటే ఖచ్చితంగా ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉంటాయో చూస్తారు కాబట్టి ఇకపై పూర్తిగా లాభాల గురించే ఆలోచించబోతున్నారు.
ఇక నుంచి అన్ని అంశాలపై పక్కాగా వ్యవహించేందుకు ప్రముఖ ఆడిటింగ్ సంస్థ కెపిఎంజిని నియమించుకున్నారు. సో.. మొత్తానికి భారత దేశ ఈ-కామర్స్ సెన్సేషన్ ఫ్లిప్ కార్ట్.. అమెరికాలో లిస్ట్ అయితే మాత్రం దేశంలో ఉన్న అనేక ఐటీ కంపెనీలకు రోల్ మోడల్‌గా నిలబడడంతో పాటు ఆశలను కూడా పెంచుతుంది.


Click it and Unblock the Notifications