న్యూఢిల్లీ: ఆదివారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. 5-6 పైసలు మాత్రమే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి చమురు ధరలు రోజు రోజుకు మారుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో పెట్రోల్ ధర శనివారం రూ.69.93గా ఉండగా, ఈ రోజు 5 పైసలు పెరిగి రూ.69.98గా ఉంది. డీజిల్ ధర రూ.63.78గా ఉండగా, నేడు 6 పైసలు పెరిగి 63.84కు చేరింది.
నోయిడాలో పెట్రోల్ ధర రూ.69.98, డీజిల్ ధర రూ.63.32, గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.70.50, డీజిల్ రూ.63.42గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.5 పైసలు పెరిగి రూ.72.19 (శనివారం) నుంచి ఈ రోజు రూ.72.24కు పెరిగింది. డీజిల్ 6 పైసలు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి రూ.75.63 (శనివారం) నుంచి ఈ రోజు రూ.75.68గా ఉంది. డీజిల్ 6 పైసలు పెరిగింది.

చెన్నైలు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలు పెరిగింది. పెట్రోల్ రూ.72.69గా, డీజిల్ రూ.67.52గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు 5 నుంచి 6 పైసలు మాత్రమే పెరిగాయి. హైదరాబాదులో పెట్రోల్ ధర రూ.74.37, డీజిల్ ధర రూ.69.58గా ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.74.17, డీజిల్ రూ.69.03గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.73.82గా, డీజిల్ ధర రూ.68.71గా ఉంది.
ఇదిలా ఉండగా, సార్వత్రిక ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని, రూ.10 నుంచి రూ.15 వరకు పెరగవచ్చునని ఎన్నికల ఫలితాలకు ముందు ప్రచారం సాగింది. రూ.90కి చేరవచ్చునని వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ఎన్నికల నేపథ్యంలో భారత్‌లో ధరలు పెంచలేదని, ఫలితాల తర్వాత భారీగా పెంపు ఉంటుందని భావించారు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం ఎన్నికల తర్వాత భారీగా పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి స్వల్పంగా హెచ్చుతగ్గులు మాత్రమే ఉంటున్నాయి.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Petrol prices: పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 పన్ను తగ్గింపు.. అయినా సామాన్యులకు ఊరట లేదు! ఏందుకంటే..

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Oil prices: ముదురుతున్న యుద్ధం! ఊహించని స్థాయిలో ఆయిల్ రేట్లు పెరగనున్నాయా?

భారీగా పెరిగిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై టికెట్ ఛార్జీల మోత తప్పదిక..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications