For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ పేలో ఇక ఆఫర్లే... ఆఫర్లు !

By Chanakya
|

హైదరాబాద్ : భారతదేశ డిజిటల్ పేమెంట్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇంతకాలం పట్టణాలకే పరిమితమైన ఈ చెల్లింపులు ఇప్పుడు చిన్న నగరాలు,గ్రామాలకు కూడా పాకుతున్నాయి. దీంతో నాలుగైదు సంస్థలు పోటాపోటీగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ ఆఫర్లను కుమ్మరిస్తున్నాయి. వాల్‌మార్ట్ సపోర్ట్‌తో నడుస్తున్న ఫోన్ పే, అలీబాబా ఇన్వెస్ట్ చేసిన పేటిఎం, గూగుల్‌కు గూగుల్ పేతో పాటు అమెజాన్ నుంచి వచ్చిన అమెజాన్ పే ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పుడు మిగిలిన మూడు సంస్థలను తట్టుకుని మరింతగా విస్తరించేందుకు అమెజాన్ సంస్థ తన డిజిటల్ వాలేట్ పే కోసం తాజాగా రూ.450 కోట్ల పెట్టుబడిని పెట్టింది. సింగపూర్‌ కేంద్రంగా ఉన్నఅమెజాన్ కార్పొరేట్, మారిషస్‌కు చెందిన అమెజాన్ డాట్ కామ్ సంస్థలు తాజాగా ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. జూన్ 6వ తేదీన జరిగిన ఈ డీల్‌లో అమెజాన్ పే నుంచి 45 కోట్ల షేర్లు సదరు సంస్థలకు బదిలీ అయ్యాయి.

ఇప్పటికే భారీ పెట్టుబడి
అమెజాన్ సంస్థ తన పే వాలెట్, మార్కెట్ ప్లేస్ కోసం ఇప్పటికే రూ.2800 కోట్లను కుమ్మరించింది. చైనా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇతర ఆప్షన్లను పరిశీలిస్తున్న అమెజాన్‌కు ఇండియా బెస్ట్ ఆప్షన్‌గా కనిపించింది. అందుకే ఈ స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పాటు దృష్టిని కూడా పెంచింది.

రూ.70 లక్షల కోట్ల మార్కెట్
క్రెడిట్ సూయిస్ రిపోర్ట్ ప్రకారం 2023 నాటికి మన దేశంలో డిజిటల్ పేమెంట్ మార్కెట్ సైజ్ ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది. అంటే సుమారు రూ.70 లక్షల కోట్ల మార్కెట్. అవును ఆశ్చర్యంగా ఉన్నా మీరు చదివింది నిజమే. అక్షరాలా 70 లక్షల కోట్ల మార్కెట్‌గా అవతరించోబోంది. అందుకే వివిధ సంస్థలు దీనిపై ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికిప్పుడు వీటివల్ల లాభం లేకపోయినా భారీగా పెట్టుబడి పెట్టి రాబోయే రోజుల్లో సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతో సాగుతున్నాయి.

offers on amazon pay

పేటిఎంతో పోటీ

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యూనిఫైడ్ పేమేంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ను డిజిటల్ పేమెంట్ సంస్థలన్నీ చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. యాండ్రాయిడ్‌తో పనిచేసే ఈ యాప్స్ ద్వారా సులువుగా బ్యాంక్ టు బ్యాంక్ మనీ ట్రాన్స్‌ఫర్స్, ఫ్రెండ్స్‌కు చెల్లింపులు, ఇతర సేవల కోసం వినియోగించుకోవడం చాలా సులువుగా మారింది. అందుకే అమెజాన్ కూడా రెండు నెలలక్రితం యూపీఐ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టి బాగా లబ్ధి పొందుతోంది. యూపీఐ ఐడీ ఉంటే చాలు ఎవరికైనా సరే.. డబ్బులు పంపుకునేందుకు వీలుగా ఉండే ఈ వేదికను ఉపయోగించుకుంటోంది. పేటిఎం, ఫోన్ పే వంటి సంస్థలకు గట్టిపోటీనిస్తోంది. తాజాగా వచ్చిన ఈ పెట్టుబడులతో వివిధ ఆఫర్లతో పాటు ప్లాట్‌ఫాంను మరింత పటిష్టం చేసి ముందుకు సాగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

English summary

అమెజాన్ పేలో ఇక ఆఫర్లే... ఆఫర్లు ! | offers on amazon pay

Online retailer Amazon has invested Rs 450 crore in its digital payments arm Amazon Pay (India). The funding would help the Seattle-based company tap India's booming digital payments market and compete with Walmart-owned PhonePe, Alibaba-backed Paytm, and Google's mobile payment service Google Pay.
Story first published: Saturday, June 22, 2019, 18:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X