ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో భేటీ అయిన 35వ జీఎస్టీ కౌన్సిల్‌ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో భేటీ అయిన 35వ జీఎస్టీ కౌన్సిల్ వస్తు సేవల పన్ను చట్టానికి (జీఎస్టీ) సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం దృవీకరణ పత్రంగా ఆధార్ తీసుకోవటం , యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ కాలపరిమితి పొడిగింపు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వెలువరించింది.
యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ కాలపరిమితిని రెండేళ్ల పాటు పొడిగింపు ..2017-18 జీఎస్టీ రిటర్నుల దాఖలు ఆగస్ట్ 30 వరకు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశ వివరాలనువెల్లడించిన రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ కాలపరిమితిని రెండేళ్ల పాటు (2021 నవంబరు వరకు) పొడిగిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు . అలాగే జీఎస్టీ రేట్ల తగ్గింపును వినియోగదారులకు బదలాయించకుండా కంపెనీలు లబ్ధి పొందిన మొత్తంలో 10 శాతం వరకు జరిమానాను విధించేందుకు ఆమోదం తెలిపిందన్నారు.మరోవైపు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలు గడువు తేదీని ఈ ఏడాది ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అంతే కాక ఉత్పత్తుల రవాణా కోసం ఈ-వే బిల్లులు సృష్టించి వరుసగా రెండు నెలలు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారు కూడా తమ రిటర్నులను ఆగస్టు 21 వరకు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.

2020 జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ విధానం..
2020 జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ విధానం అమల్లోకి రానుందని , అలాగే జనవరి 1 నుంచి పైలెట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ఎలెక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ విధానాన్ని అమలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని పాండే చెప్పారు . లాటరీలపై విధిస్తున్న పన్ను దేశవ్యాప్తంగా ఒకటే ఉంటే బాగుంటుందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారని, అందుకనుగుణంగానే ఈ అంశా న్ని అటార్నీ జనరల్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. నకిలీ ఇన్వాయిస్ లకు సంబంధించి రాష్ట్రాలతో కేంద్రం అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోనుందని పాండే తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)పై విధిస్తున్న జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి, ఈవీ చార్జర్లపై విధిస్తున్న పన్నును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ప్రతిపాదనలు వచ్చాయని పాండే తెలిపారు. అయితే ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఫిట్‌మెంట్ కమిటీకి సిఫారసు చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి 35వ జీఎస్టీ కౌన్సిల్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications