అమరావతి: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఉక్కు పరిశ్రమ పోస్కో స్టీల్ కంపెనీ.. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ సంస్థ సీఈవో బాంగ్ గిల్ హో నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలో ఏపీకి టెక్నికల్ బృందాన్ని పంపించనున్నట్లు తెలిపారు.

కడపను పరిశీలించాలని జగన్
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... పరిశ్రమల ఏర్పాటును తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వీటి వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. పోస్కో కంపెనీ ప్రతిపాదనలను పరిశీలించాలని, తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. కంపెనీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని అన్వేషించనున్నారు. ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని జగన్ వారికి సూచించారు. ఇక్కడ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కంపెనీ మూడు నెలల్లో తేల్చనుంది. రూ.30,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థ RINL(విశాఖ స్టీల్)తో కలిపి ఏర్పాటు చేసేందుకు పోస్కో కంపెనీ ఆసక్తిగా ఉంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ద్వారా దాదాపు 6,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

పెట్టుబడులపై జపాన్ కంపెనీ ఆసక్తి
జపాన్‌కు చెందిన ఏటీజీ టైర్ల కంపెనీ కూడా పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సమీపంలో దాదాపు రూ.1,600 కోట్లతో టైర్ల కంపెనీని నెలకొల్పేందుకు ఏటీజీ ఆసక్తిగా ఉంది. 100 నుంచి 125 ఏకరాల్లో అచ్యుతాపురం సెజ్ లో దీనిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. వ్యవసాయ, నిర్మాణ రంగంలోని యంత్రాలకు వినియోగించే భారీ టైర్లను ఈ సంస్థ తయారు చేస్తోంది. మహారాష్ట్రలో ఈ కంపెనీ యూనిట్ ఉంది. ఏపీలో మరో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తితో ఉంది.

సీఎంను కలిసిన చైనా ఎలక్ట్రానిక్ సంస్థ
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ టీసీఎల్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి జగన్‌తో పెట్టుబడుల అంశంపై చర్చించింది. రూ.2,200 కోట్లతో 153 ఎకరాల్లో డిస్‌ప్లే ప్యానల్ యూనిట్‌కు గత డిసెంబర్‌లో శంకుస్థాపన చేశారు. భూమి, నీటి సమస్య కారణంగా ప్రాజెక్టు పనులు ముందుకు కదల్లేదు. ఈ అంశంపై సీఎంతో వారు చర్చించారు. సూపర్ ప్రోయాక్టివ్ క్లియరెన్స్ కింద ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని, అలాగే టీసీఎల్ సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే
పోస్కో కంపెనీతో జగన్ చర్చల సమయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేనని చెప్పారు. పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేసి, అమలు చేస్తామన్నరు. ఐటీ అభివృద్ధికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు విశాఖ కేంద్రంగా పెద్ద పెద్ద ఉండేలా చూస్తామన్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో BPOల ఏర్పాటుకు స్థల లభ్యత తక్కువగా ఉందని, ఆయా చోట్ల అద్దెలు భారీగా ఉన్నందున ఏపీలోని ద్వితీయ శ్రేణి పట్టణాలు వీటికి అనుకూలమని భావిస్తున్నట్లు గౌతమ్ రెడ్డి చెప్పారు.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications