ముంబై: టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ IPO (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానుందని వార్తలు వస్తున్నాయి. 2020 ఏడాది రెండో అర్ధభాగంలో ఐపీవోకు రానుందని తెలుస్తోంది. ఈ మేరకు పలుమార్లు వివిధ వర్గాలతో చర్చలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది.

పలుమార్లు సమావేశాలు
కంపెనీకి చెందిన టవర్స్, ఫైబర్ అసెట్స్ కలిగిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (InvITs)కు పెట్టుబడిదారులను పొందడం తొలి ప్రాధాన్యం అని చెబుతున్నారట. ఈ మేరకు గత నెలలో పలుమార్లు సమావేశాలు జరిగాయని తెలుస్తోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్... బ్యాంకర్లు, కన్సల్టెంట్లతో సమావేశమయ్యారు. ఐపీవో వైపు వేగంగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. త్వరలో కస్టమర్లపరంగా పోటీదారుల కంటే ముందుకు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుందట. దీంతో రెవెన్యూ ఎక్కువ వస్తుందని భావిస్తోందని చెబుతున్నారు.
ప్రస్తుత 4G నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా, 5G స్పెక్ట్రమ్ కొనుగోలు అలాగే తన మౌలిక సదుపాయాలను నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేయడం కూడా పెద్ద సవాల్ అని చెబుతోంది.

ARPU ఇలా...
జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) తగ్గిపోతోంది. జనవరి-మార్చి పీరియడ్‌లో రూ.126.2గా ఉంది. అంతకుముందు క్వార్టర్‌లో ఇది 131.7గా ఉంది. వరుసగా అయిదో క్వార్టర్ కూడా పడిపోయింది. అయితే భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ARPU జియో కంటే తక్కువగానే ఉంది. పోటీ నేపథ్యంలో ARPU తగ్గిపోతోంది.

లాభాలు నివేదించిన ఏకైక టెల్కో
మార్చి త్రైమాసికంలో లాభాలను నివేదించిన ఏకైక టెల్కో రిలయన్స్ జియో. వినియోగదారులపరంగా, సేవలపరంగాను ఇది దూసుకెళ్తోంది. 2019 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.840 కోట్ల స్వతంత్ర లాభాన్ని నమోదు చేసింది. నికర లాభం 65 శాతం పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.510 కోట్లు నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ. 2,964 కోట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా జియో ఐపీవోపై గతంలోను వార్తలు వచ్చాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications