For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగుతున్న బంగారం విక్రయాలు, ఆరేళ్ల గరిష్టానికి ధరలు

|

బంగారం ధర ఆరేళ్ల గరిష్టానికి చేరుకుంది. 2013 తర్వాత ఆ స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 1400 డాలర్ల మార్క్‌కు చేరుకుంది. ఇది ఆరేళ్ల గరిష్టస్థాయి కావడం గమనార్హం. డాలర్ బలహీనపడటం, ఆర్థిక ఆందోళనలు, అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, ఇరాన్.. అమెరికా స్పై డ్రోన్‌ను కూల్చడం వంటి అంశాల నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశముందని భావిస్తున్నందున... పసిడికి డిమాండ్ పెరిగింది.

రూ.34,000 దాటిన బంగారం ధర, కారణాలివేరూ.34,000 దాటిన బంగారం ధర, కారణాలివే

భారత్‌లో బంగారం ధర శుక్రవారం నాడు 1 శాతం పెరిగి రూ.34,400 వద్ద ట్రేడ్ అయింది. గ్లోబల్ కేంద్ర బ్యాంకులు పసిడి కొనుగోల వైపు చూస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోత విధిస్తుందని సంకేతాలు ఉన్నాయి. దీంతో బంగారం ధర రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. గురువారం కూడా బంగారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

 Gold extends gains, prices near 6 year high

తాజా WGC రిపోర్ట్ ప్రకారం... ఆసియాలోని పలు కేంద్ర బ్యాంకులు బంగారాన్ని సేకరిస్తున్నాయని, ఇందులో చైనా, భారత్, కజకిస్తాన్‌లు ఉన్నాయని, వీటితో పాటు యూరోప్ దేశాలైన రష్యా, పోలాండ్, హంగేరీ వంటి దేశాలు కూడా బంగారాన్ని సమకూర్చుకుంటున్నాయని, ఇప్పుడే ప్రారంభమైనప్పటికీ ఈ ప్రభావం బంగారం ధరలపై చూపిస్తోందని చెబుతున్నారు.

బంగారం ధర జూన్ నెలలో పది శాతం వరకు పెరిగింది. ఒన్స్ బంగారం ధర 1411 స్థాయికి చేరుకుంది. 2013 సెప్టెంబర్ నుంచి చూస్తే ఇది గరిష్టం. 2011లో యూరోజోన్ సంక్షోభం కారణంగా బంగారం ధర ఔన్స్ 1900 డాలర్లకు చేరుకుంది.

English summary

పెరుగుతున్న బంగారం విక్రయాలు, ఆరేళ్ల గరిష్టానికి ధరలు | Gold extends gains, prices near 6 year high

Gold futures topped $1,400 an ounce for the first time since 2013, riding bullish momentum after major central banks projected more dovish stances this week and geopolitical tensions rose.
Story first published: Friday, June 21, 2019, 13:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X