వరుస పతనాలతో కునారిల్లుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ లాభాల బాటలో పయనించాయి. నిఫ్టీ ఏకంగా 150 పాయింట్లు, సెన్సెక్స్ సుమారు 500 పాయింట్లతో ఎగిరి గంతేశాయి. ప్రధానంగా లార్జ్ క్యాప్ నిఫ్టీ స్టాక్స్‌లో భారీ లాభాలు కలిసొచ్చాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సులు కూడా ఒకటిన్నర శాతం వరకూ పెరిగాయి. ఎఫ్ఎంసిజి, ఐటి మినహా దాదాపు అన్ని రంగాల షేర్లూ లాభపడ్డాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో,బ్యాంకింగ్, రియాల్టీ రంగ కౌంటర్లు ఎగిరి గంతేశాయి. చివరకు 489 పాయింట్ల లాభంతో 39601 దగ్గర సెన్సెక్స్, 140 పాయింట్ల లాభంతో 11832 దగ్గర నిఫ్టీ ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్ 420 పాయింట్లు పెరిగి 30781 దగ్గర క్లోజైంది.
యెస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యూపీఎల్, విప్రో, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయిన షేర్ల జాబితాలో చేరాయి. గతవారం, ఈ వారం ప్రారంభంలో భారీగా పడిపోయిన కొన్ని గ్రూపు స్టాక్స్‌లో తప్ప మిగిలిన మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో మాత్రం ఆ స్థాయి పాజిటివ్ యాక్టివిటీ లేకపోవడం ప్రధానంగా గమనించాల్సిన అంశం.
జెట్ ఎయిర్ 150 శాతం పెరిగిందా ?

నష్టాల్లో కునారిల్లిపోతున్న జెట్ ఎయిర్ వేస్ స్టాక్‌లో ఈ రోజు ఆఖరి పదినిమిషాల్లో అనూహ్యమైన జంప్ నమోదైంది. ఇంట్రాడేలో రూ.26.55కి పడిపోయిన స్టాక్ ఆఖర్లో శివాలెత్తింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఉన్న స్టాక్ కావడంతో ఎలాంటి బ్రేకుల్లేకుండా స్టాక్ పెరిగింది. ఇంట్రాడేలో ఏకంగా 140 శాతం పెరిగిన స్టాక్ రూ.83 వరకూ వెళ్లింది. ఆఖర్లో మళ్లీ కొద్దిగా తగ్గినప్పటికీ రూ.63 దగ్గర క్లోజైంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఓ స్టాక్‌లో ఇలాంటి ఒడిదుడుకులు చూడలేదని మార్కెట్ వర్గాలు నోరెళ్లబెట్టాయి.
వాస్తవానికి ఈ రోజు ఎన్.సి.ఎల్.టి నుంచి జెట్ ఎయిర్ దివాలా పిటిషన్‌పై తీర్పు వెలువాడాల్సి ఉంది. న్యూస్ ఏదైనా ముందే లీక్ కావడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అడాగ్ స్టాక్స్‌లోనూ జోష్
పేకమేడల్లా కుప్పకూలిపోతున్న అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలోనూ ఈ రోజు జోష్ వచ్చింది. రిలయన్స్ ఇన్ఫ్రా 30 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 27 శాతం, రిలయన్స్ పవర్ సుమారు 25 శాతం వరకూ పెరిగాయి.
మొన్న పడ్డాయ్.. ఈ రోజు పెరిగాయ్...
గతవారమంతా భారీగా పతనమైన డిహెచ్ఎఫ్ఎల్, జెకె బ్యాంక్, సుజ్లాన్, జైన్ ఇరిగేషన్, యెస్ బ్యాంక్, ఎడిల్వైజ్ వంటి హై బీటా స్టాక్స్‌లో ఈ రోజు ఎక్కడేలని ఉత్సాహం వెల్లువెత్తింది. డిహెచ్ఎఫ్ఎల్ సుమారు 10 శాతం వరకూ పెరిగింది. యెస్ బ్యాంక్ 11 శాతం, జెకె బ్యాంక్ 10 శాతం, సుజ్లాన్ - జైన్ ఇరిగేషన్ స్టాక్స్ 20 శాతానికి పైగా పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచాయి.
పిరమల్‌లో పతనం ఆగింది
గత ఐదు నెలల్లో ఎప్పుడూ లేనంతగా వరుసగా ఆరు రోజుల పాటు పతనమైన పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ఈ రోజు కాస్త తేరుకుంది. సుమారు 8 శాతం వరకూ పెరిగింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా భారీగా పెరిగాయి.
ఇండియాబుల్స్ మేనేజ్మంట్ మాటలు నమ్మొచ్చా
డిహెచ్ఎఫ్ఎల్‌తో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు, ఆర్థికంగా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందీ లేదు, నిధుల కటకట అస్సలే లేదు.. ఇదీ ఇండియాబుల్స్ గ్రూప్ ఛైర్మన్ మీడియాతో చెప్పిన మాట. వీటిని ఎంతవరకూ నమ్మాలో చెప్పడం కష్టం కానీ.. ఇన్ని రోజుల నుంచి నీరసంగా ఉన్న ఈ స్టాక్‌కు మాత్రం ఇవి తాత్కాలిక బూస్టింగ్ ఇచ్చాయి. దీంతో ఐబీ హౌసింగ్ 8 శాతం లాభంతో రూ.600 దగ్గర క్లోజైంది. దీంతో పాటు ఐబీ వెంచర్స్ స్టాక్ కూడా లాభపడింది.
యూపీఎల్‌కు హెచ్ఎస్‌బీసీ ఎఫెక్ట్
అమెరికా, చైనా ట్రేడ్ టెన్షన్స్ నేపధ్యంలో యూపీఎల్ ఆదాయంపై గణనీయమైన ప్రభావం ఉంటుందని హెచ్ ఎస్ బీ సీ తన నివేదికలో పేర్కొంది. ఒక్క లాటన్ అమెరికా నుంచే యూపీఎల్‌కు 35 శాతం వరకూ ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు అక్కడ ఏదైనా టెన్షన్ తలెత్తితే ఒత్తిడి ఉండొచ్చు అనే ఉద్దేశంతో స్టాక్ 9 శాతం పతనమైంది. చివరకు రూ.870 దగ్గర క్లోజైంది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications