రూ.34,000 దాటిన బంగారం ధర, కారణాలివే
బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్, దేశీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయి. బంగారం చాన్నాళ్ల తర్వాత రూ.34 వేల మార్క్ దాటింది. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ అభిప్రాయపడింది. గురువారం ఢిల్లీలో గ్రాము బంగరం ధర రూ.34,020గా ఉంది.
గురువారం ఒక్కరోజే రూ.280 పెరిగింది.
మరోవైపు వెండి ధర కూడా నేడు పెరిగింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.710 పెరగడంతో కేజీ వెండి ధర రూ.39,060గా ఉంది. ప్రపంచమార్కెట్‌ను పరిశీలిస్తే న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,385.54 డాలర్లు, ఔన్స్ వెండి ధర 15.35 డాలర్లుగా ఉంది.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేటును కట్ చేస్తుందనే అంచనాల నేపథ్యంలో స్పాట్ గోల్డ్ అయిదేళ్ల గరిష్టం 1,386 డాలర్లకు చేరుకుందని చెబుతున్నారు.
గత నాలుగు వారాలుగా బంగారం ట్రేడింగ్ క్రమంగా పెరుగుతోందని, ధరలుకూడా పెరుగుతున్నాయని, అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం ఉద్రిక్తతలు, బలహీనమైన ప్రపంచ వృద్ధి నేపథ్యంలో అందరి చూపు పసిడివైపు పడిందని, వెండికి కూడా ఇదే వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బంగారంపై పెట్టుబడులు మంచిదని భావించారని చెబుతున్నారు.
ఢిల్లీలో పది గ్రాముల 99.9 ప్యూరిటీ బంగారం రూ.280 పెరగడంతో రూ.34,020గా ఉంది. 99.5 శాతం నాణ్యత కలిగిన బంగారం ధర రూ.33,850గా ఉంది. సావరీన్ బంగారం ఎనిమిది గ్రాములకు రూ.26,800గా ఉంది.


Click it and Unblock the Notifications