హైదరాబాద్: అపోలో మునిచ్ హెల్త్ ఇన్సురెన్స్‌లోని మెజార్టీ వాటాను HDFC కొనుగోలు చేయనుంది. 50.8 శాతం స్టేక్ HDFC తన పరం చేసుకోనుంది. రూ.1,336 కోట్లకు ఈ డీల్ కుదిరింది. ఆ తర్వాత ఇది HDFC ఎర్గో జనరల్ ఇన్సురెన్స్‌లో విలీనం కానుంది. అపోలో మునిచ్‌లో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వాటా 50.8 శాతంతో పాటు ఉద్యోగులకు సంబంధించిన 0.4 శాతం వాటాను కూడా HDFC కొనుగోలు చేస్తుంది. ఇందుకు అపోలో హాస్పిటల్స్‌కు రూ.1,336 కోట్లు, ఉద్యోగులకు రూ.10.84 కోట్లు చెల్లిస్తుంది. మొత్తం 51.2 శాతం స్టేక్‌కు రూ.1,347 కోట్లు చెల్లించనుంది.

రెండో అతిపెద్ద సంస్థ అవుతుంది
ఈ విక్రయానికి షేర్ హోల్డర్స్, నియంత్రణ సంస్థల అనుమతులు లభించవలసి ఉంది. ఈ డీల్ పూర్తి కావడానికి తొమ్మిది నెలల సమయం పట్టవచ్చునని భావిస్తున్నారు. HDFC ఎర్గోలో విలీనం తర్వాత ఈ సంస్థ టర్నోవర్ రూ.10,807 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో రెండో అతిపెద్ద ఇన్సురెన్స్ సంస్థ అవుతుంది. అపోలో మునిచ్ హెల్త్ ఇన్సురెన్స్‌లో మునిచ్ వాటా 49 శాతం.

రెండు దశల్లో డీల్ పూర్తి
అపోలోకు HDFC చెల్లించే రూ.1,347 కోట్లతో పాటు.. జర్మనీకి చెందిన బీమా రంగ సంస్థ మునిచ్ హెల్త్ కూడా రూ.294 కోట్లు చెల్లించనుంది. అంటే అపోలో మొత్తం రూ.1,630 కోట్లు రానున్నాయి. రెండు కంపెనీల విలీనం ద్వారా మనుగడలోకి వచ్చే కంపెనీ దేశవ్యాప్తంగా 308 శాఖలతో నాన్ లైఫ్ బీమా విభాగంలో 6.4 శాతం వాటా కలిగి ఉంటుంది. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. మొదట నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఇన్సురెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (Irdai), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్‌తో తొలుత 51.2 వాటాను HDFC దక్కించుకుంటుంది. రెండో దశలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, Irdai అప్రూవల్స్ అనంతరం HDFC ఎర్గోలో అపోలో మునిచ్ విలీనం ఉంటుంది.

నాలుగు రెట్లు..
జర్మన్ సంస్థ మునిచ్ హెల్త్ భాగస్వామ్యంతో అపోలో మునిచ్‌ను అపోలో హాస్పిటల్స్ నెలకొల్పింది. 2006 నుంచి ఈ సంయుక్త సంస్థలో రూ.300 కోట్లు వరకు పెట్టుబడులు పెట్టింది. ఈ కొనుగోలు ప్రతిపాదనలో భాగంగా అపోలో హాస్పిటల్స్‌కు HDFC చెల్లించనున్న ఒక్కో షేర్‌కు రూ.73 లేదా రూ.1,336 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే పెట్టిన పెట్టుబడిపై నాలుగు రెట్లకు పైగానే రానుంది. HDFC ఎర్గోలో ఎర్గో ఇంటర్నేషనల్ కూడా 49 శాతం వాటా ఉంది. 2016లో HDFC ఎర్గో.. ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన 100 శాతం వాటాను రూ.551 కోట్లకు దక్కించుకుంది. ఇది ఎంతో ఉపకరించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications