ముంబై: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) రూ.20,000 కోట్లను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేయనుందని తెలుస్తోంది. తన బ్రాడ్‌బ్యాండ్, ఈ-కామర్స్ సేవలతో పాటు భవిష్యత్తు 5G సేవల కోసం కూడా ఈ మొత్తాన్ని వినియోగించేందుకు ఈ మొత్తాన్ని ఇవ్వెస్ట్ చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారని చెబుతూ కథనాలు వచ్చాయి.

రిలయన్స్ జియో కార్యకలాపాల విస్తరణ కోసం
రిలయన్స్ జియో తన కార్యకలాపాల విస్తరణ కోసం 4 బిలియన్ నాన్ క్యుమ్యులేటివ్ షేర్లను ఇష్యూ చేయనుంది. వీటిని ఆ తర్వాత ప్రిఫరెన్షియల్ షేర్లుగా కూడా మార్చుకునె వెసులుబాటు ఉంటుంది. వీటి విలువ రూ.50గా ఉండనుంది. రిలయన్స్ జియో ఆపరేషన్స్ పెంచేందుకు ఈ మొత్తాన్ని (రూ.20వేల కోట్లు) ఉపయోగిస్తామని, అందుకే నాన్ క్యుమ్యులేటివ్ షేర్లు ఇష్యూ చేస్తామని, వీటి వడ్డీ రేటు 9 శాతంగా ఉండనుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారని చెబుతున్నారు.

బ్రాండ్‌బాండ్ సేవలపై దృష్టి
రిలయన్స్ దినదినాభివృద్ధి కోసం వరుసగా ఇన్వెస్ట్ చేస్తోంది. మార్చి 31వ తేదీ నాటికి RIL ఔట్‌స్టాండింగ్ డెబిట్ రూ.2.87 ట్రిలియన్లు. జియోలో రూ.69,000 కోట్ల పెట్టుబడుల కారణంగా ఆ మేరకు పెరిగింది. ప్రస్తుతం జియో అండర్‌సర్వ్‌డ్ హోమ్స్, ఎంటర్‌ప్రైజెస్ కనెక్టివిటీ మార్కెట్ పైన దృష్టి సారించింది. మొబిలిటీ సేవలతో పాటు గిగాఫైబర్ బ్రాండ్‌బాండ్ సేవలపై దృష్టి సారించింది.

జియో టవర్ నిర్మాణం కోసం పోలీసుల ప్రొటక్షన్
ఇదిలా ఉండగా, తమిళనాడులోని కోయంబత్తూరులో రిలయన్స్ జియో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం నేపథ్యంలో జియో టీమ్‌కు పోలీస్ ప్రొటక్షన్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. రేడియేషన్ కారణాలతో ఈ నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం కాగా, అవి నిరూపితం కాలేదని కోర్టు పేర్కొంది. ఈ మేరకు స్థానికులు ఇక్కడ సెల్ టవర్ ఏర్పాటును నిరసిస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో జియో పోలీసులను ఆశ్రయించింది. వారు స్పందించలేదు. దీంతో కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు రిలయన్స్ జియోకు అనుకూలంగా వచ్చింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications